Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడి నీటితో స్నానం చేస్తే వ్యాయామం అక్కర్లేదట... నిజమా?

సాధారణంగా ప్రతి ఒక్కరూ వేడి నీటితో స్నానం చేసేందుకు ఇష్టపడతారు. మరికొందరు సీజన్‌కు అనుగుణంగా వేడి, చన్నీటితో స్నానం చేసేందుకు ఆసక్తి చూపుతారు. అయితే, వేడి నీటితో స్నానం చేసే వారు వ్యాయాయం చేయనక్కర్లేద

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (13:33 IST)
సాధారణంగా ప్రతి ఒక్కరూ వేడి నీటితో స్నానం చేసేందుకు ఇష్టపడతారు. మరికొందరు సీజన్‌కు అనుగుణంగా వేడి, చన్నీటితో స్నానం చేసేందుకు ఆసక్తి చూపుతారు. అయితే, వేడి నీటితో స్నానం చేసే వారు వ్యాయాయం చేయనక్కర్లేదట. ఈ విషయాన్ని లండన్ శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిరూపించారు. అదెలాగంటే...
 
బాగా అలసిపోయి వచ్చినా.. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నా.. వేడినీటితో స్నానం చేస్తే మ‌న‌సు హాయిగా ఉంటుంది. నిజానికి వేడి నీటితో స్నానం చేయడం మంచి అల‌వాటే. పైగా, ఇది ఓ వ్యాయామంతో సమానమట. ప్రతిరోజూ వేడినీటితో స్నానం చేసే వారు గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండ‌వ‌చ్చని, అంతేగాక‌, రక్తపోటు, మధుమేహంవంటి రోగాలు సైతం త‌గ్గుముఖం ప‌డ‌తాయ‌ని వారు చెబుతున్నారు. 
 
ఇందుకోసం 2,300 మందిపై పరిశోధన చేశారు. వీరి పరిశోధనలో 30 నిమిషాలు బ్రిస్క్‌వాక్ చేయించ‌డంతో 140 కేలరీలు ఖ‌ర్చయినట్లు, అనంత‌రం వారికి వేడినీటితో స్నానం చేయించిన‌ట్లు తెలిపింది. వేడి నీటితో స్నానం చేశాక‌ కూడా 140 కేలరీలు ఖర్చయినట్లు వారు తెలిపారు. అయితే, శ్రమతో బ్రిస్క్ వాక్ చేయడం కంటే వేడి నీటితో స్నానం చేయడం ఉత్తమని లండన్ పరిశోధకులు తెలిపారు.

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments