Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిప్పతీగ ఆరోగ్య ప్రయోజనాలు... కానీ అలాంటివారు వాడకూడదు...

Webdunia
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (19:22 IST)
తిప్పతీగను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తిప్పతీగను ఉపయోగించి జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ తయారుచేస్తారు. ఇవన్నీ కూడా కొన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి బాగా ఉపయోగపడతాయి. తిప్పతీగను కషాయంలా చేసుకుని తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. తిప్పతీగలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
 
1. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడగలవు. అలాగే శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ బాగా పని చేస్తుంది.
 
2. అజీర్తి సమస్యతో బాధపడుతున్నవారు తిప్పతీగతో తయారుచేసిన మందుల్ని వాడితే మంచిది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచగల శక్తి తిప్పతీగకు ఉంటుంది. కాస్త తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకుని తింటే చాలు... అజీర్తి సమస్య పోతుంది. 
 
3. తిప్పతీగ హైపోగ్లైకేమిక్ ఏజెంట్‌గా పని చేస్తుంది. తిప్పతీగలో మధుమేహాన్ని నివారించే గుణాలున్నాయి. ముఖ్యంగా టైప్ 2 మధుమేహం తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలదు.
 
4. తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి తిప్పతీగ మందులు బాగా పని చేస్తాయి. దగ్గు, జలుబు, టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించగల గుణాలు తిప్పతీగలో ఉన్నాయి.
 
5. ఆర్థరైటిస్‌తో బాధపడేవారు తిప్పతీగను ఉపయోగిస్తే చాలా మంచిది. కీళ్లవ్యాధులను తగ్గించే గుణాలు తిప్పతీగలో చాలా ఉన్నాయి. తిప్పతీగ పొడిని కాస్త వేడి పాలలో కలుపుకుని తాగితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యల బారి నుంచి బయటపడొచ్చు. ఆ పాలలో కాస్త అల్లం కలుపుకుని కూడా తాగొచ్చు.
 
6. తిప్పతీగ వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయగలదు. అలాగే ముఖంపై మచ్చలు, మొటిమలు రాకుండా, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉంటాయి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తిప్పతీగతో తయారుచేసిన మందులను వాడకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అల్పపీడన ప్రభావం- తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

Nandamuri Balakrishna: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ అవతారమెత్తిన బాలకృష్ణ (video)

బాలుడిని ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి.. అక్కడే హత్య.. వాడు మనిషేనా?

తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదు.. బాలికను కిడ్నాప్ చేశారు.. కానీ 2 గంటల్లోనే?

ప్రియుడితో ఏకాంతంగా లేడీ పోలీస్, భర్త వచ్చేసరికి మంచం కింద దాచేసింది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

మహావతార్ నరసింహ: పురాణాలకు దగ్గరగా వుంది.. మహావతార్ నరసింహ అవతారాన్ని చూసినట్లుంది (video)

సారధి స్టూడియోలో భీమవరం టాకీస్ 15 చిత్రాలు ప్రారంభం

తర్వాతి కథనం
Show comments