దొండకాయ వేపుళ్లు, కూరలు తింటే మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చునని.. శరీరంలో చక్కెర స్థాయుల్ని తగ్గించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. దొండకాయలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. పీచూ, ప్రోటీన్లు కూడా లభ్యమవుతాయి.
అయితే వారానికి నాలుగైదు లేదా మూడు సార్లు మాత్రమే దొండకాయను తీసుకోవాలి. ముఖ్యంగా రోజువారీ డైట్‌లో ఒక కప్పు మేర దొండకాయను తీసుకుంటే డయాబెటిస్‌ను నిరోధించే వీలుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
ఇందులో ఉండే క్యాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. దొండకాయ ఆకుల పేస్టును రోజుకు మాత్రల్లా వాడితే బ్యాక్టీరియాతో ఏర్పడే చర్మ సమస్యలు వుండవు. జలుబు, దగ్గును కూడా దొండ నయం చేస్తుంది. శరీరం నుంచి మలినాలను చెమట ద్వారా వెలివేస్తుంది. దొండకాయ పిత్త వ్యాధులను, రక్తపోటును, వాత వ్యాధులను నియంత్రిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.