Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం తలంటు స్నానం.. చల్లనినీటిని వాడుతున్నారా?

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2022 (15:24 IST)
కొంతమంది దీపావళికి మాత్రమే తలంటు స్నానం చేస్తారు. అయితే వారానికి ఒకసారి శనివారం పూట నువ్వుల నూనెతో తలంటుకుని తలస్నానం చేయడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలెన్నో పొందవచ్చు. వారానికి ఒక్కసారి నువ్వుల నూనెతో తలస్నానం చేస్తే రోగాలు తగ్గి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. 
 
కొబ్బరి నూనె స్నానం జుట్టు కుదుళ్లకు పోషకాలను అందిస్తుంది. అలాగే శరీరంలోని అధిక వేడిని దూరం చేస్తుంది. పొడి చర్మం ఉన్నవారికి తలంటుకుని స్నానం చేయడం ఒక వరం. ఆ నూనెను శరీరమంతా రాసుకుంటే చెమట వల్ల ఏర్పడే మురికి తొలగిపోతాయి.
 
శరీరంలో వేడి తగ్గి మనసు ఉల్లాసాన్ని పొందుతుంది. కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల కళ్లు ఎర్రబడి ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి వారానికోసారి కొబ్బరి నూనె లేదా నువ్వులనూనెతో తలస్నానం చేయడం వల్ల దృష్టి, కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. తలంటు స్నానం అంటే తల నుంచి అరికాళ్ల వరకు నూనె రాయాలి. అరగంట సేపు ఎండలో ఉండి స్నానం చేయడం మంచి ఆరోగ్యాన్నిస్తుంది. 
 
అదేవిధంగా కొందరు నూనె రాసుకుని చల్లటి నీటితో స్నానం చేస్తుంటారు. దీని వల్ల జలుబు, ఫ్లూ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నూనె రాసుకున్నప్పుడల్లా వేడి నీళ్లతో తలస్నానం చేయాలి.
 
తలంటు స్నానం చేసేటప్పుడు షాంపూలు వాడకపోవడం మంచిది. ఇవి నూనె జిగురును తొలగించవు. కాబట్టి తలంటు స్నానం చేస్తే.. శీకాకాయ పొడి, శెనగపిండిని ఉపయోగించాలి.
 
నలంగు పిండిని శరీరానికి రాసుకుని స్నానం చేయవచ్చు. ఇలాంటి పౌడర్లను రాసుకుని స్నానం చేయడం వల్ల చర్మంలోని జిడ్డు, మురికి మొదలైనవి తొలగిపోయి చర్మం మెరిసిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తర్వాతి కథనం
Show comments