పొట్లకాయలోని పోషకాలు, అది చేసే మేలు ఎంతో వుంది. మన శరీరానికి కావాల్సిన డైటరీ ఫైబర్ విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉన్నాయి.
షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడంలో పొట్లకాయ ఎంతో మేలు చేస్తుంది.
పొట్లకాయ తినడం, పొట్లకాయ జ్యూస్ తాగడం వల్ల షుగర్ శాతాన్ని తగ్గిస్తుంది.
పొట్లకాయ మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి అజీర్తి లేకుండా చేస్తుంది.
పొట్లకాయ తినడం వల్ల శరీరంలోని వేడిని బయటకు పంపుతుంది.
ఇందులోని విటమిన్ సి పవర్‌పుల్ యాంటీ యాక్సిడెంట్‌గా పనిచేస్తుంది.
పొట్లకాయ చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది.
రక్తపోటు సమస్యను అదుపులో ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
గమనిక: చిట్కాలు పాటించే ముందు వైద్యుని సలహా తప్పనిసరి.