ఆయుర్వేదం ప్రకారం.. దంతాలు ఇలా శుభ్రం చేసుకోవాలి...

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (15:11 IST)
దంతములను, నోటిని శుభ్రపరచుకునేటప్పుడు తూర్పు, ఉత్తరాభిముఖంగా నుంచుని గానీ, కూర్చుని గానీ చేయాలి. దంతములను శుభ్రం చేయడానికి మఱ్ఱి, చండ్ర, కానుగ, మద్ది, వేప మొదలగు పచ్చిపుల్లలను ఉపయోగించవచ్చు. దీనిని బాగా నమిలి.. కుచ్చు వచ్చు నట్లుగా చేసి, ఆకుచ్చుతో దంతాలను రుద్దుతూ శుభ్రపరచుకోవాలి. చిగుళ్ళకు నొప్పికలగకుండా శుభ్రపరచాలి. శాస్త్రోక్తమైన పండ్లపొడిని కూడా ఉపయోగించి రుద్దుకోవచ్చును.
 
దంతములు శుభ్రమునకు.. తీపి కలవాటిలో ఇప్పపుల్ల, కారం గల వాటిలో.. కానుగపుల్ల, చేదుగల వాటిలో వేపపుల్ల, వగరు గల వాటిలో.. చండ్రపుల్ల చాలా శ్రేష్టమైనవి. వీటి బద్దలతో నాలుక గీచుకుని శుభ్రపరచాలి. నోటి శుభ్రతకు.. వేడినీటిని ఉపయోగించాలి. చాలాసార్లు పుక్కిలిపట్టి వదులుతూ నోటిని శుభ్రపరచుకోవాలి. దీనివలన నోటియందు పాచి, సూక్ష్మక్రిములు నశించి వ్యాధులు రాకుండా అరికడుతుంది.
 
కంఠంలోగానీ, పెదవులు, నాలుక, దంతములలో వ్యాధులు కలిగినప్పుడు, నోటియందు పుండు ఏర్పడినపుడు.. పైన పేర్కొన్న పుల్లలతో నోటిని శుభ్రం చేయకూడదు. నేత్రవ్యాధులు, హృద్రోగం కలవారు కూడా వ్యాధి నయమయేవరకూ వీటితో దంత శుభ్రత చేయకూడదు. ఇలాంటి వ్యాధులు గలవారు వెండి, రాగి లేక తాటాకుతో నాలుక మీద పాచిని తొలగించి శుభ్రం చేసుకోవాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భర్తను చంపేందుకు రూ.5 లక్షలు సుపారీ ఇచ్చాం : భార్య వాంగ్మూలం

లోక్‌సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు - అనుకూలం 298, వ్యతిరేకం 230

800 అడుగులో లోయలో పడిన టూరిస్ట్ వ్యాను - 10 మంది మృతి

హర్ముజ్‌ జలసంధిని తెరిచాం... నౌకా రవాణాకు ఓకే : ఇరాన్ ప్రకటన

విపక్షాలది మహిళా వ్యతిరేక మైండ్‌సెట్ : అమిత్ షా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: తన తండ్రి చిరంజీవిని తన ఆదర్శ హీరోగా పేర్కొన్న రామ్ చరణ్

అమ్మాయిలను వేధించే వారికి శిక్షలు ఉండాలని చెప్పే ఓ అందాల రాక్షసి

The Big Picture: దేశవ్యాప్తం గా తొలి రియాలిటీ షో బిగ్ పిచ్చర్ ప్రారంభం

Naga Chaitanya: INCA అవార్డ్స్ 2026లో తాండెల్ చిత్రానికి ఉత్తమ నటుడిగా నాగ చైతన్య

మత్స్యకారుల జీవితాలలో మరో కోణంగా తెరచాప చిత్రం రివ్యూ

తర్వాతి కథనం
Show comments