Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలంలో నెయ్యి తీసుకుంటే... కలిగే ప్రయోజనాలివే..?

Webdunia
శనివారం, 17 నవంబరు 2018 (09:49 IST)
ఈ కాలంలో సీజన్ వేరియేషన్ వలన పలురకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా చలి విపరీతంగానే ఉంది. ఈ చలి ఉపశమనం పొందాలంటే.. నెయ్యిని తీసుకోవాలి. నెయ్యిని తరచుగా తీసుకున్నవారికి శరీరోగ నిరోధక శక్తి పెరిగిందని ఇటీవలే ఓ పరిశోధనలో తెలియజేశారు. మరి నెయ్యిని తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..
 
1. దగ్గు, జలుబు, ముక్కుదిబ్బ వంటి వ్యాధుల నుండి విముక్తి లభించాలంటే.. ప్రతిరోజూ ఉదయాన్నే గ్లాస్ గోరువెచ్చని పాలలో 3 స్పూన్ల నెయ్య కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. 
 
2. చలికాలంలో చాలామంది శక్తిని కోల్పోయి నీరసంగా, అలసటగా కనిపిస్తుంటారు. అలాంటివారికి నెయ్యి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. రోజుకు ఒక్కసారి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి కలిపి సేవిస్తే పై తెలిపిన సమస్యలుండవు.
 
3. కొంతమందికి ఏ ఆహార పదార్థాలు తీసుకున్నా జీర్ణవ్యవస్థ అంతగా ఉంటుంది. ఈ సమస్య వలన కడుపునొప్పి, వాంతులు, కళ్లు తిరగడం వంటి వాటికి గురౌతారు. వీటికి చెక్ పెట్టాలంటే.. నెయ్యిని తరచుగా తీసుకోవాలి. దాంతో జీర్ణవ్యవస్థ మెరుగపడుతుంది. 
 
4. రోజూ మీరు తయారుచేసుకునే ఆహార పదార్థాల్లో లేదా కూరల్లో కొద్దిగా నెయ్యి వేసి తీసుకుంటే శరీరానికి కావలసిన పోషక విలువలు పుష్కలంగా అందుతాయి. దాంతో రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. 
 
5. చలికాలంలో చర్మం రక్షణకోసం ఏవేవో మందులు, క్రీములు వాడుతుంటారు. వాటిని వాడడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి సౌందర్య సాధనకు ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు.  అందుకు నెయ్యి ఎంతగానో పనిచేస్తుంది. 
 
6. ఒక బౌల్‌లో 5 స్పూన్ల్ నెయ్యిని వేడిచేసుకుని అది బాగా చల్లారిన తరువాత అందులో కొద్దిగా పెరుగు, నిమ్మరసం కలిపి చర్మానికి రాసుకోవాలి. గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత స్నానం చేయాలి. ఇలా తరచుగా చర్మ సౌందర్యం మరింత పెరుగుతుంది.  
 
7. అల్సర్ వ్యాధితో బాధపడేవారు నెయ్యిని వేడి చేసి అందులో కొద్దిగా చక్కెర లేదా పెరుగు కలిపి సేవిస్తే సమస్య పోతుంది. నెయ్యిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలితో పాటు ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష

Mega DSC: మెగా డీఎస్పీ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి.. నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

తర్వాతి కథనం
Show comments