Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మకాయ రసం, తేనె, దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే?

దాల్చిన చెక్క వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు ఎన్నో వున్నాయి. దాల్చిన చెక్క పొడిని వాడటం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు.. గ్లాసుడు గోరువెచ్చని నీటిలో ఒక న

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (13:41 IST)
దాల్చిన చెక్క వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు ఎన్నో వున్నాయి. దాల్చిన చెక్క పొడిని వాడటం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు.. గ్లాసుడు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మ పండు రసాన్ని పిండుకుని.. అందులో చెరో స్పూన్ తేనె, దాల్చిన చెక్క పొడిని కలిపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం పూట పరగడుపున తీసుకోవాలి. ఇలా మూడు నెలల పాటు చేస్తే.. సులభంగా బరువు తగ్గుతారు. అంతేగాకుండా హృద్రోగాలను దూరం చేసుకోవచ్చు. ఇన్ఫెక్షన్లు, చుండ్రుకు చెక్ పెట్టవచ్చు. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
 
డ‌యాబెటిస్ ఉన్న వారికి దాల్చిన చెక్క ఎంత‌గానో మేలు చేస్తుంది. నిత్యం ఒక స్పూన్ మోతాదులో దాల్చిన చెక్క‌ పొడిని తీసుకుంటుంటే.. డయాబెటిస్ తగ్గుతుంది. ఇది రక్తంలో ఉండే చ‌క్కెర స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. ఇన్సులిన్ లాంటి గుణాలు కలిగి ఉన్నందున టైప్ 2 మాత్ర‌మే కాదు, టైప్ 1 డ‌యాబెటిస్ ఉన్న వారికి కూడా ఇది మేలు చేస్తుంది.
 
ఇంకా దాల్చిన‌చెక్క‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉన్నాయి. పాలిఫినాల్స్ అన‌బ‌డే ప్ర‌త్యేక‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి. ఇన్ ఫెక్ష‌న్ల బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణాలు దాల్చిన చెక్క‌లో ఉన్నాయి. దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగ‌వుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments