పిల్లలకు అరటిపండును స్నాక్స్ రూపంలో తినిపిస్తే?
పిల్లలకు.. పోషకాహారాన్ని అందించడంలో తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. ఉదయం పూట ఆహారంతో పాటు ఓ పండును ఇవ్వడం చేయాలి. పిల్లలు బాగా నీరసంగా ఉంటే తక్షణం శక్తినందించే అరటి పండును తిని పించండి. అరటి పండును ఉదయ
Publish Date: Mon, 30 Oct 2017 (16:08 IST)
Updated Date: Mon, 30 Oct 2017 (16:10 IST)
పిల్లలకు.. పోషకాహారాన్ని అందించడంలో తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. ఉదయం పూట ఆహారంతో పాటు ఓ పండును ఇవ్వడం చేయాలి. పిల్లలు బాగా నీరసంగా ఉంటే తక్షణం శక్తినందించే అరటి పండును తిని పించండి. అరటి పండును ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా కానీ సాయంత్రం పూట నాలుగైదు గంటలకు స్నాక్స్ రూపంలో తినిపిస్తే పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
అలాగే నారింజ పండును పిల్లలకు తినిపిస్తే విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. తద్వారా వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. బొప్పాయి పండులో ఎ, సి లు సమృద్ధిగా ఉంటాయి. బొప్పాయిలో ఉండే శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతో పాటు అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది. ఆపిల్ పండును రోజుకొకటి పిల్లలకు పెట్టడం ద్వారా పిల్లల శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.
అలాగే పైనాపిల్‌లో విటమిన్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అధిక రక్తపోటును, గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. అనారోగ్య సమస్యలను దూరం చేయాలంటే.. ద్రాక్షపండ్లను పిల్లల డైట్‌లో చేర్చుకోవడం ద్వారా వారిలో చెడు కొలెస్ట్రాల్ దూరమవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.