Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలంలో పుల్లటి గోంగూర తీసుకుంటే... కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టొచ్చు..

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (10:39 IST)
శీతాకాలంలో వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి కలుపుకుని.. దానికి కాస్త నెయ్యి జతచేసి తీసుకుంటే.. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. పుల్లటి గోంగూర రుచికే కాదు.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గోంగూరలో విటమిన్ సి, ఎ, బి 6తో పాటు ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం పుష్కలంగా వుంటుంది. 
 
అందుకే గోంగూరను తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎముకలు బలపడతాయి. రక్తప్రసరణ సజావుగా కొనసాగుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లను రానివ్వకుండా చేస్తుంది. ముఖ్యంగా మధుమేహాన్ని నియంత్రిస్తుంది. గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. గోంగూరను వారానికి రెండుసార్లు ఆహారంలో చేర్చుకుంటే. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. 
 
గోంగూరను క్రమంగా వాడితే నిద్రలేమి, అధిక రక్తపోటు తగ్గుతుంది. ప్రతి రాత్రి నిద్రకు ముందు ఓ కప్పు గోంగూర రసం తాగితే హాయిగా నిద్రపోవచ్చు. ముఖ్యంగా మూడు పదులు దాటిన మహిళలు రోజూ ఒక కప్పు గోంగూర తీసుకోవాలి. 
 
ఇలా తీసుకుంటే, ఐరన్, సోడియం, క్యాల్షియం, పొటాషియం అందుతుంది. తద్వారా మహిళలకు రుతుక్రమంలో ఏర్పడే నొప్పులు తొలగిపోతాయి. ఇంకా శరీరానికి కావలసిన శక్తి లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

తర్వాతి కథనం
Show comments