Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ సీజన్‌లో దొరికే రేగిపండ్లు తీసుకుంటే..?

Advertiesment
berry
, మంగళవారం, 11 డిశెంబరు 2018 (10:22 IST)
శీతాకాలంలో రేగిపండ్లు చాలా విరివిగా దొరుకుతాయి. వీటి రుచి చాలా బాగుంటుంది. రేగిపండ్లంటే ఇష్టపడి తినేవారు చాలామంది. రేగిపండ్లు ఈ సీజన్‌లో తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం..
 
1. హైబీపీతో బాధపడేవారు ఈ సీజన్‌లో దొరికే రేగిపండ్లు తీసుకుంటే బీపీని అదుపు చేయవచ్చని చెప్తున్నారు నిపుణులు. తరచు ఈ పండ్లు తీసుకుంటే రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది. దాంతో రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడుతుంది. 
 
2. రేగిపండ్లలోని క్యాల్షియం ఎముకలను బలంగా చేస్తుంది. చాలామంది స్త్రీలకు రుతు సమయంలో వచ్చే నొప్పులతో సతమతమవుతుంటారు. ఈ నొప్పులు తగ్గించాలంటే.. రేగిపండ్ల గింజలను ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి. ఇలా చేసిన పొడిలో కొద్దిగా ఉప్పు, పెరుగు కలిపి తీసుకుంటే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
 
3.  రేగిపండ్లలోని గుజ్జును తీసి అందులో కొద్దిగా ఉప్పు, కారం కలిపి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ చేసిన మిశ్రమాన్ని క్రమంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరును సాఫీగా సాగుతుంది.  
 
4. రేగిపండ్లు తీసుకోవడం వలన చర్మం సురక్షితంగా ఉంటుంది. జిడ్డు చర్మానికి రేగిపండ్లు చాలా దోహదపడుతాయి. రేగిపండ్ల గింజలను వేరుచేసి దాని నుండి వచ్చే గుజ్జును మాత్రం తీసుకుని అందులో కొద్దిగా తేనె, కలబంద గుజ్జు కలిపి ముఖానికి రాసుకుంటే జిడ్డు చర్మం పోయి ముఖం తాజాగా మారుతుంది. 
 
5. రేగిపండ్లలోని ఫైబర్ ఆకలి నియంత్రణకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. తద్వారా బరువును కూడా తగ్గించుకోవచ్చును. రక్తహీనతతో బాధపడేవారు రేగి పండ్లను తింటే మంచిది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శృంగారం కోసం ఎగబడతావేంటి? అదొక్కటే ముఖ్యమా? నా అందం అంటోంది...