Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెర్బల్ బాత్ పౌడర్‌ ఇంట్లోనే ఎలా చేయాలంటే?

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (19:54 IST)
Ayurvedic Herbal Bath Powder
హెర్బల్ బాత్ పౌడర్‌ ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. బాడీ వాష్ కోసం కెమికల్ ఉత్పత్తులను ఉపయోగించకుండా, యాంటీ -ఏజింగ్ లక్షణాలు గల హెర్బల్ బాత్ పౌడర్‌ను ఉపయోగించాలని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఈ పౌడర్‌ని రోజూ ఉపయోగించడం వల్ల చర్మం చాలా మృదువుగా మారుతుంది. ఈ బాత్ పౌడర్ 3 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఉపయోగించవచ్చు.
 
ఈ హెర్బల్ బాత్ పౌడర్ ముఖంపై వున్న జుట్టును తొలగిస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. మొటిమలను తొలగిస్తుంది. సన్ టాన్‌ను తొలగిస్తుంది.
 
కావలసిన పదార్థాలు 
ముడి పెసరపప్పు -ఒక కప్పు
శెనగపప్పు - ఒక కప్పు  
నారింజ తొక్క - ఒక కప్పు 
గులాబీ రేకులు - ఒక కప్పు  
వట్టివేరు - ఒక కప్పు  
బాదం - ఒక కప్పు  
తంగేడు పువ్వులు- అర కప్పు
మెంతులు-  ఒక కప్పు
 
తయారీ ఎలా?
అన్ని పదార్థాలను 4 గంటలు ఎండలో ఆరబెట్టాలి.
దీన్ని మెత్తగా పొడి చేసి జల్లెడ పట్టాలి.
చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకోవాలి.
 
ఎలా ఉపయోగించాలి.. 
పొడిని అవసరమైన పరిమాణంలో తీసుకోండి.
పేస్ట్ చేయడానికి కొద్దిగా నీరు కలపండి. 
సబ్బుకు బదులుగా ఈ పేస్ట్‌ని ఉపయోగించండి.
పొడి చర్మం కోసం పొడిని నీరు / పెరుగు / పాల మీగడ / పాలు కలుపుకోవచ్చు. 
ఆయిల్ స్కిన్ కోసం పొడిని తేనె/నీటితో కలిపి చర్మానికి రాసుకోవచ్చు. 
ఈ పొడిని స్క్రబ్బర్‌గా కూడా ఉపయోగించవచ్చు.
అంతేగాకుండా ముఖానికి ఫేస్ ప్యాక్‌గానూ ఉపయోగించవచ్చు.

సంబంధిత వార్తలు

పిఠాపురంలో పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు.. ఆవిడ వద్ద ఆశీర్వాదం

గుంటూరు అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని

బొత్స ఫ్యామిలీ ఆస్తులు రూ.19.76 కోట్లు... వంగా గీత ఆస్తులు రూ.29.15 కోట్లు

ఇజ్రాయేల్ దాడులు.. గర్భిణీ మృతి.. ప్రాణాలతో బయటపడిన గర్భస్థ శిశువు

ఇది ఏకగ్రీవం కాదు.. అది నియంత నిజమైన ముఖం : సూరత్ ఏకగ్రీవంపై రాహుల్ స్పందన

ఒకే లొకేషన్‌లో నాగచైతన్య, శోభితా.. కలిసే వెళ్లారా?

మ్యారేజ్ బ్యూరోలు విఫలయినా అతను ఓ అమ్మాయి ప్రేమలో ఎలా పడ్డాడో తెలిపేదో ఆ ఒక్కటీ అడక్కు

తనను కామెంట్ చేయడంతో ఆ హీరోపై ఫైర్ అయిన నభా నటేష్

శబరి లో బిడ్డపై తల్లి ప్రేమ, అనురాగం చూపించే పాట

డైమండ్ వాచ్‌తో ఫోజులిచ్చిన సమంత.. ధర అక్షరాలా రూ.70లక్షలు?

తర్వాతి కథనం
Show comments