Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందభైరవి మాత్ర ఒకటి వేసుకుంటే అవన్నీ తగ్గిపోతాయ్...

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (11:01 IST)
సాధారణంగా కడుపులో రకరకాల బాధలు కలుగుతుంటాయి. వీటన్నింటికీ ఆనంధబైరవి చాలా మంచి మందు. ఇది నేరుగా ఆయుర్వేద మందులషాపులో లభిస్తుంది.
 
1. ఆనందభైరవి మాత్ర ఒకటి వేసుకుని అల్లపురసం త్రాగితే వాంతులు, కడుపులో మంట, నోట్లో నీళ్లూరడం, గ్యాస్ ట్రబుల్స్, పుల్లటి త్రేనుపులు, జ్వరం ఇవన్నీ తగ్గిపోతాయి.
 
2. ఆనందభైరవి మాత్ర ఒకటి వేసుకుని మిరియాల్ని నేతిలో వేయించి దంచి, తడిపి నూరి, రసాన్ని బాగా పిండి, రసంలో పంచదార కలుపుకుని త్రాగుతుంటే కడుపు, శరీర నొప్పులు, జలుబు, దగ్గు నివారిస్తాయి.
 
3. ఆనందభైరవి మాత్ర ఒకటి వేసుకుని, కుటజారిష్ట అనే ఆయుర్వేద మందును రెండుచెంచాలు తీసుకుని, నీళ్ళు కలిపి త్రాగితే రక్తవిరోచనాలు, జిగట విరేచనాలు, అమీబియాసిస్ వ్యాధులు నివారిస్తాయి. 
 
4. బీపీ ఉన్నవారు ఆనందభైరవి మాత్రలను రెండుపూటలా రెండేసి చొప్పున తీసుకుంటూ, యష్టిచూర్ణం పావుచెంచా పాలలో కలుపుకుని త్రాగుతుంటే బీపీ అదుపులో ఉంటుంది.
 
5. బూడిదగుమ్మడి రసం తీసుకుని దానికి సమానంగా ఆవుపాలు కలిపి, అందులో పదోవంతు ఉసిరిపొట్టును కలిపి పొయ్యిమీద పెట్టి నీరంతా కరిగిపోయి ముద్దగా అయ్యే వరకూ వండాలి. ఈ వచ్చిన ముద్దకు సమానంగా పంచదారను కలిపి రోజూ ఉదయం, సాయంత్రం ఒక్కో చెంచా తింటుంటే కడుపులోని అనేక దోషాలు, పేగుపూత, రక్తస్రావాలు, అసిడిటీ తగ్గిపోతుంది. గుండె జబ్బులు రాకుండా ఈ ఔషధం కాపాడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెన్ను వివాదం ఓ విద్యార్థిని ప్రాణం తీసింది... ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకేసింది..

కారులో ప్రియురాలుతో సర్పంచ్, డోర్ తీసి పిచ్చకొట్టుడు కొట్టిన భార్య (video)

డొనాల్డ్ ట్రంప్‌తో భారతీయ ఐటీకి కష్టకాలం.. వీసా ఆంక్షలు సైతం పీడకల?!

"ఫ్యూచర్ సిటీ"తో రేవంత్ రెడ్డికి తలనొప్పులు.. ఆ కల కోసం.. ఆ పని చేయకపోతే..?

ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్ మూర్తి నాయుడు ఇకలేరు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

తర్వాతి కథనం
Show comments