ఎంతో మందిని పీడిస్తున్న వ్యాధి డయాబెటిస్. దీనిని షుగర్, మధుమేహ వ్యాధి అని కూడా అంటారు. ఇది ఒకసారి మొదలైతే ఇక తగ్గిటమంటూ ఉండదు. కాబట్టి వ్యాధి పెరగకుండా చూసుకోవడమే రోగులు చేయవలసింది...
1. నేరేడు కాయలోని గింజలను తీసుకుని బాగా దంచి అన్నంలో కలుపుకుని తిన్నా, మజ్జిగలో కలుపుకుని త్రాగినా షుగర్ వ్యాధి పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
2. మెంతుల్ని మొలకలు కట్టించి, బాగా ఎండబెట్టి దోరగా వేయించుకోవాలి. దీన్ని రోజూ అన్నంలో కారప్పొడి కలిగితింటున్నట్లు తింటే.. మధుమేహ వ్యాధిని అరికట్టవచ్చును.
3. ఉసిరికాయలలోని గింజలను తీసివేసి, దానికి సమానంగా పసుపు తీసుకుని రెంటినీ కలిపి బాగా దంచి పొడి చేసుకోవాలి. దీన్ని రోజుకు రెండుపూటలా ఒక చెంచా చొప్పున మజ్జిగలో కలుపుకుని తాగుతుంటే షుగర్ వ్యాధి పూర్తి కంట్రోల్లో ఉంటుంది.
4. పొడిపత్రి అనే ఆకు వనమూలికలు అమ్మే కొట్లలో లభిస్తుంది. పల్లేటూర్లలో ఉండే వాళ్లకి ఈ మొక్క బాగా తెలుస్తుంది. పొడపత్రి ఆకులు, మారేడు లేత చిగుళ్ళు, నేరేడు గింజల లోపలి పప్పు, లేత వేపచిగుళ్ళు, పత్తిగింజల లోపలి పప్పు.. వీటన్నింటిని సమానంగా తీసుకుని బాగా ఎండబెట్టి ఆ తరువాత పొడి చేసుకోవాలి.
5. ఈ పొడిని రోజూ క్రమం తప్పకుండా మజ్జిగలో కలుపుకుని తాగుతుంటే డయాబెటిస్ వ్యాధి కంట్రోల్లోకి వస్తుంది. వ్యాధి తీవ్రంగా ఉంటే.. ఈ పొడిని మూడుపూటలా తీసుకోవచ్చు.