Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆమ్లా రైస్.. ఎలా చేయాలో తెలుసా?

Advertiesment
ఆమ్లా రైస్.. ఎలా చేయాలో తెలుసా?
, శనివారం, 5 జనవరి 2019 (11:27 IST)
కావలసిన పదార్థాలు:
బియ్యం - అరకప్పు
ఉసిరికాయలు - 10
పసుపు - అరస్పూన్
ఇంగువ - కొద్దిగా
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా
నువ్వుల పొడి - 1 స్పూన్స్
జీడిపప్పు - 4
ఎండుమిర్చి - 4
పచ్చిమిర్చి - 4
కరివేపాకు - రెండు రెమ్మలు
కొత్తిమీర కట్ట - 1
శెనగపప్పు - 1 స్పూన్
మినప్పప్పు - 1 స్పూన్
ఆవాలు - 1 స్పూన్
 
తయారీ విధానం:
ముందుగా అన్నం వండుకుని బౌల్‌లో ఆరబెట్టాలి. ఇప్పుడు ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో ఉప్పు వేసి వాటిని కచ్చాపచ్చాగా దంచాలి. లేదా పెద్ద ఉసరికాయలైతే తురుముకోవచ్చు. ఆ తరువాత పాన్లో నూనె వేసి కాగిన తరువాత అందులో పసుపు, ఎండుమిర్చి, శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి.

ఆపై అందులోనే పచ్చిమిర్చి, నువ్వుల పొడి, కరివేపాకు, జీడిపప్పు, దంచిన ఉసిరికాయ ముక్కలు, ఇంగువ వేసి దోరగా వేయించాలి. 2 నిమిషాలు మీడియం మంట మీద వేయించుకుని ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు ఆరబెట్టి చల్లారిన తరువాత అన్నంలో కలుపుకోవాలి. అంతే... ఆమ్లా రైస్ రెడీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శీతాకాలంలో చర్మ సంరక్షణ... ఈ చిట్కాలు పాటిస్తే...