Webdunia - Bharat's app for daily news and videos

Install App

2020 సంవత్సర ఫలితాలు- వృషభ రాశి వారి ఫలితాలు ఎలా వున్నాయో తెలుసా?

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (17:11 IST)
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
 
ఆదాయం : 14 వ్యయం : 11 రాజ్యపూజ్యం : 6 అవమానం: 1
 
పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. హామీలు నిలబెట్టుకుంటారు. వివాహ యత్నం ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. స్థిరాస్తి, వాహనం అమర్చుకుంటారు. సోదరులతో అవగాహన నెలకొంటుంది. 
 
ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాలు, పరిశ్రమల స్థాపనలకు అనుకూలం. సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. ఏజెన్సీలు, టెండర్ల దక్కించుకుంటారు. 
 
ఆరోగ్యం పట్ల  శ్రద్ధ వహించాలి. తరుచు వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఉపాధ్యాయులకు, ఉద్యోగస్తులకు పదోన్నతి. అధికారులకు స్థానచలనం. వృత్తిల వారికి సామాన్యం. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. తరచూ ప్రయాణాలు చేస్తారు. దైవ చింతన అధికమవుతుంది.
 
కృత్తికా నక్షత్రం వారు స్టార్ రూబి, రోహిణి నక్షత్రం ముత్యం, మృగశిర నక్షత్రం వారు పగడం ధరించినట్లైతే శుభం కలుగుతుంది. ఈ రాశివారు లక్ష్మీగణపతిని తెల్లనిపూలతో పూజించి ఇష్టకామేశ్వరి దేవిని ఎర్రని పూలతో పూజించడం వల్ల  సమస్యలు తొలగి మానసికంగా కుదుటపడతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఘోరం: పాశమైలారం రియాక్టర్ భారీ పేలుడులో 13 మంది మృతి

రూ. 2.5 కోట్లతో పెళ్లి, 500 సవర్ల బంగారంలో మిగిలిన 200 సవర్లు ఎప్పుడు?: నవ వధువు ఆత్మహత్య

శ్రీశైలం లడ్డూలో చచ్చిన బొద్దింక: ఆ బొద్దింక ఎలా వచ్చిందో చూస్తున్నారట

తుక్కుగూడలో హిజ్రాలు, డబ్బులు ఇచ్చే దాకా వాహనాలకు అడ్డంగా నిలబడి ఆవిధంగా (video)

రెస్టార్ట్ గదిలో ఆత్మహత్యకు పాల్పడిన బావమరదలు.. ఎందుకంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

తర్వాతి కథనం
Show comments