2020 సంవత్సర ఫలితాలు- మేష రాశి వారి ఫలితాలు ఎలా వున్నాయో తెలుసా?

మంగళవారం, 10 డిశెంబరు 2019 (16:54 IST)
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
 
ఆదాయం : 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 3 అవమానం: 1
 
ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. కొన్ని సమస్యల నుంచి విముక్తులవుతారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాల పరిచయాలు బలపడతాయి. పదవులు, కాంట్రాక్టులు దక్కవు. ఆరోగ్యంలో స్వల్ప ఒడిదుడుకులు వుంటాయి. 
 
గృహ నిర్మాణాలు, సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వైద్య, న్యాయ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. తరచూ ఆలయాలు సందర్శిస్తారు. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం. 
 
విలువైన పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. కోర్టు వ్యవహారాలు వాయిదాలతోనే సాగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలపై దృష్టి పెడతారు. ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి ఆశాజనం.
 
అశ్వని నక్షత్రం వారు కృష్ణవైఢూర్యం, భరణి నక్షత్రం వారు వజ్రం, కృత్తికానక్షత్రం వారు కెంపు ధరించిన శుభదాయకంగా వుంటుంది. ఈ రాశివారు దుర్గమ్మ తల్లిని ఎర్రని పూలతో, వరసిద్ధి వినాయకుడిని గరికతో పూజించినట్లైతే శుభం, జయం, పురోభివృద్ధి కానవస్తుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం శార్వరినామ సంవత్సర ఫలితాలు.. ఆంధ్రప్రదేశ్‌కు సమస్యలుండవ్..