Webdunia - Bharat's app for daily news and videos

Install App

2020 సంవత్సర ఫలితాలు- ధనస్సు రాశి వారి ఫలితాలు ఎలా వున్నాయో తెలుసా?

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (18:36 IST)
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం 
ఆదాయం : 8 వ్యయం : 11 రాజ్యపూజ్యం : 6 అవమానం : 3
 
ఈ రాశివారికి శుభయోగం. రుణ సమస్యల నుంచి బయటపడుతారు. కార్యసిద్ధి, వ్యవహారానుకూలత వుంది. ఆదాయం బాగుంటుంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. తరుచు వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు.
 
పెట్టుబడులకు అనుకూలం. స్వయం కృషితో రాణిస్తారు. బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. గృహమార్పు అనివార్యం. ప్రేమానుబంధాలు బలపడతాయి. బంధువులు చేరువవుతారు. ఊహించని సంఘటనలెదురవుతాయి. 
 
సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ఆందోళన కలిగించిన సమస్యలు సద్దుమణుగుతాయి. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. భాగస్వామిక వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పుణ్యక్షేత్రాలు, విదేశాలు సందర్శిస్తారు. 
 
మూల నక్షత్రం వారు కృష్ణ వైఢూర్యం, పూర్వాషాఢ వారు వజ్రం, ఉత్తరాషాఢ వారు స్టార్ రూబి ధరించినట్లైతే శుభం కలుగుతుంది. ఈ రాశి వారు శ్రీమన్నారాయణుడిని పున్నాగపూలతో పూజించడం వల్ల శుభం, జయం, పురోభివృద్ధి పొందుతారు.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

అక్షయ తృతీయ.. లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న రోజు ఇదే..

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

తర్వాతి కథనం
Show comments