Webdunia - Bharat's app for daily news and videos

Install App

19-02-2023 నుంచి 25-02-2023 వరకు మీ వార రాశిఫలాలు

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2023 (19:46 IST)
మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
ఈ వారం అనుకూలదాయకం. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఆదాయం సంతృప్తికరం. దుబారా ఖర్చులు తగ్గించుకోగలుగుతారు. పనులు వేగవంతమవుతాయి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
పరిస్థితుల క్రమంగా మెరుగుపడతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోవాలి. సలహాలు, సహాయం ఆశించవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. విమర్శించిన వారే కొనియాడుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి, ధనం మితంగా వ్యయం చేయండి. సన్నిహితులు సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. గృహమార్పు అనివార్యం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. నిరుద్యోగులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. చిరువ్యాపారులకు ఆశాజనకం. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. ఆశావహ దృక్పథంతో మెలగండి. ఆదివారం నాడు ఆప్తుల కలయిక వీలుపడదు. దంపతులకే కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. సంతానం దూకుడు అదుపు చేయండి. పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు పనిభారం. మార్కెటింగ్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు
లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దుబారా ఖర్చులు విపరీతం. రుణ సమస్యలు వేధిస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. సోమ, మంగళవారాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆత్మీయులతో సంభాషణ ఉపశమననం కలిగిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్లో మెలకువ వహించండి. అవివాహితులకు శభవార్తా శ్రవణం. వృత్తి, ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. హోల్సేల్ వ్యాపారులు, స్టాకిస్టులు అప్రమత్తంగా ఉండాలి. అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. ఆస్తి వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి. ప్రయాణం తలపెడతారు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
మనోధైర్యంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. కష్టసమయాల్లోనే మీ విజ్ఞతను చాటుకుంటారు. మీ కృషి, పట్టుదల స్ఫూర్తిదాయకమవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆదాయ మార్గాలే అన్వేషిస్తారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బుధ, గురువారాల్లో ఎవరినీ అతిగా నమ్మవద్దు. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతి ధోరణిలో నిదానంగా మార్పు వస్తుంది. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అకౌంట్స్, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. దైవదర్శనాలు ఉల్లాసం కలిగిస్తాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
అన్ని రంగాల వారికి కలిసివచ్చే సమయం. లక్ష్యం నెరవేరుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. శనివారం నాడు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిశ్చయమవుతుంది. పెట్టిపోతల్లో మెళకువ వహించండి. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువవైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఉద్యోగస్తులు ప్రశంసలందుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి. వేడుకకు హాజరవుతారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
గ్రహ సంచారం బాగుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయ. వివాహితులకు శుభయోగం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు తప్పకపోవచ్చు. సన్నిహితుల రాక ఉపశమనం కలిగిస్తుంది. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. వాహనదారులకు దూకుడు తగదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. పనులు హడావుడిగా సాగుతాయి. మంగళవారం నాడు చెల్లింపుల్లో జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ శ్రీమతి అంతర్యం గ్రహించండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితమిస్తాయి. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. దూరాన ఉన్న ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. అకాల భోజనం, విశ్రాంతి లోపం. ఖర్చులు అంచనాలను మించుతాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. గురు, శుక్రవారాల్లో దంపతుల మధ్య ఆకారణ కలహం. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం చదువులపై దృష్టిపెడతారు. గృహమార్పు మంచి ఫలితమిస్తుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. పత్రాల రెన్యువల్లో నిర్లక్ష్యం తగదు. నూతన వ్యాపారాలు అంతగా కలిసిరావు. డీలర్లు, స్టాకిస్టులకు ఆశాజనకం. ఉద్యోగస్తుల ఓర్పు ప్రధానం. రిప్రజెంటేటివ్‌లు టార్గెట్లను పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారం సమస్యాత్మకమవుతుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. వేడుకకు హాజరవుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. శనివారం నాడు ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులకు ఆశాజనకం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు
గ్రహాల సంచారం అంత అనుకూలంగా లేదు. అప్రమత్తంగా ఉండాలి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అందరితో మితంగా సంభాషించండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టంమ్మీద తీరుతాయి. మీ శ్రీమతి వైఖరిలో ఆశించి మార్పు వస్తుంది. వేడుకకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. చిన్నారులకు విలువైన కానుకలు సమర్పించుకుంటారు. సోమ, మంగళవారాల్లో పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు ఒత్తిడి అధికం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. ధార్మికత పట్ల ఆసక్తి పెంపొందుతుంది. సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బుధ, గురువారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన నేత పుట్టిన రోజు.. ఏలూరులో రేవ్ పార్టీ.. అశ్లీల నృత్యాలు (video)

రేణిగుంట: క్యాషియర్ మెడపై కత్తి పెట్టిన యువకుడు.. సంచిలో డబ్బు వేయమని? (video)

డిసెంబర్ 21-25 వరకు భవానీ దీక్ష.. భక్తుల కోసం భవానీ దీక్ష 2024 యాప్

ప్రేమకు హద్దులు లేవు.. వరంగల్ అబ్బాయి.. టర్కీ అమ్మాయికి డుం.. డుం.. డుం..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాయలసీమ, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

Weekly Horoscope : 15-12-2024 నుంచి 21-12-2024 వరకు మీ రాశిఫలాలు

Today Daily Astro 14-12-2024 శనివారం దినఫలితాలు

తర్వాతి కథనం
Show comments