Webdunia - Bharat's app for daily news and videos

Install App

12-01-05 నుంచి 18-01-2025 వరకు ఫలితాలు

రామన్
శనివారం, 11 జనవరి 2025 (20:07 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఈ వారం అన్ని విధాలా యోగదాయకమే. ఆదాయం బాగుంటుంది. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. వ్యవహారజయం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాల్లో లాభనష్టాలు లెక్కవేసుకుంటారు. చిన్నవ్యాపారులకు సామాన్యం. ఉద్యోగపరంగా ఆశించిన ఫలితాలున్నాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. పందాలు, క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. పరిచయస్తుల వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. అపజయాలకు కుంగిపోవద్దు. లక్ష్యాన్ని సాధించే వరకు యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు భారమనిపించవు. ఆప్తులను విందులు, వేడుకకు ఆహ్వానిస్తారు. ఆదివారం నాడు ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. సంస్థల స్థాపనకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారాల్లో స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికావద్దు. మీ అభిప్రాయాలను ధైర్యంగా తెలియజేయండి. కొంతమొత్తం ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో పెట్టుబడులు తగదు. పెద్దల సలహా పాటించండి. సోమ, మంగళ వారాల్లో చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. అయిన వారితో కాలక్షేపం చేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వివాదాలు సద్దుమణుగుతాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. విందులు, వేడుకలకు హాజరవుతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలతో తీరిక ఉండదు. ఆచితూచి అడుగేయాల్సిన సమయం. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. మీ ఇబ్బందులను పెద్దలకు తెలియజేయండి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. గురువారం నాడు అనుకోని సంఘటననలెదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగపరంగా ఆశించిన ఫలితాలున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్యంలో పాల్గొంటారు. వాహనదారులకు దూకుడు తగదు. 
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆశావహదృక్పధంతో మెలగండి. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. లక్ష్యసాధనకు ఓర్పు, పట్టుదల ముఖ్యం. సలహాలు, సాయం ఆశించవద్దు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. శుక్ర, శని వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతికి ప్రతి విషయం తెలియజేయండి. సంతానానికి శుభం జరుగుతుంది. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు బాగుంటుంది. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. కళాపోటీల్లో స్త్రీలు విజయం సాధిస్తారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. ఇంటి అవసరాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. అసాధ్యమనుకున్న పనులు సానుకూలమవుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. ఆది, సోమ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. అవతలి వారి స్తోమతును క్షుణ్ణంగా తెలుసుకోండి. తొందరపడి హామీలివ్వవద్దు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. నోటీసులు అందుకుంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సర్వత్రా అనుకూలదాయకమే. వ్యవహారానుకూలత, వస్త్రప్రాప్తి ఉన్నాయి. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. పరిచయస్తులతో సంభాషిస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. వేడుకలు, విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. సంతానం దూకుడు అదుపు చేయండి. గురువారం నాడు ఊహించని సంఘటననలెదురవుతాయి. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. కళ, క్రీడా పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. ఖర్చులు అదుపులో ఉండవు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఒక వార్త ఉత్సాహపరుస్తుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు చేజారిపోతాయి. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచించండి. శుక్రవారం నాడు అందరితోను మితంగా సంభాషించండి. ప్రైవేట్ సంస్థల వారికి ఓర్పు ప్రధానం. అంకితభావంతో పనిచేస్తే మంచి ఫలితాలుంటాయి. ఇతరుల బాధ్యతలు తీసుకోవద్దు. మీ ఇష్టాలను సున్నితంగా తెలియజేయండి. వ్యాపారాలో ఆశించిన లాభలు గడిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థికసమస్యలు కొలిక్కివస్తాయి. రుణ విముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనులు చురుకుగా సాగుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఆదివారం నాడు బాధ్యతలు అప్పగించి ఇబ్బంది పడతారు. లక్ష్యాన్ని సాధించే వరకూ శ్రమించండి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. హామీలు నిలబెట్టుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆరోగ్యం సంతృపస్తికరం. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. వాహనం మరమ్మతులకు గురవుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వృత్తి ఉద్యోగ పరంగా మంచి ఫలితాలున్నాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అనుకూల వాతావరణం నెలకొంటుంది. స్థిరాస్తి మూలక ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. సోమ, మంగళ వారాల్లో ఆచితూచి అడుగేయాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు తగదు. పెద్దల సలహా పాటించండి. పరిచయం లేని వారితో జాగ్రత్త. విదేశాల నుంచి సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. కొందరి వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. విజ్ఞతతో మెలగండి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు, అంకితభావం ముఖ్యం. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. ఆటుపోట్లను తట్టుకుంటారు. పందాలు, పోటీల్లో దూకుడు తగదు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో విశేష ఫలితాలున్నాయి. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. కుటుంబీకుల ప్రోతాహం ఉంటుంది. లక్ష్యం సాధించే వరకు శ్రమించండి. సాయం ఆశించవద్దు. బుధవారం నాడు చేసిన పనులే చేయవలసి వస్తుంది. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. సంతానం దూకుడు అదుపు చేయండి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. ఉద్యోగ బాధ్యతల్లో మరింత శ్రద్ధ వహించండి. ఉన్నతాధికారులకు ఆకస్మిక స్థానచలనం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. జూదాలు. బెట్టింగ్ల జోలికి పోవద్దు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అనుకూలతలు అంతంత మాత్రమే. చిన్న విషయానికే చికాకుపడతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ నిందించవద్దు. మనస్సుకు నచ్చిన వ్యక్తులతో కాలక్షేపం చేయండి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. అవకాశాలు కలిసివస్తాయి. సంతానానికి శుభఫలితాలున్నాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కుటుంబీకుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు. సోదరులతో సంప్రదిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం. విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషిస్తారు. ప్రయాణం చికాకుపరుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మైన‌ర్ బాలిక‌పై లైంగిక దాడి- గర్భం దాల్చింది.. ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు

పిన్నాపురంలో పవన్ పర్యటన.. హెలికాప్టర్‌ ద్వారా సోలార్ పవర్ ప్రాజెక్ట్ పరిశీలన (video)

ఘనంగా ఘట్కేసర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 6 వార్షికోత్సవం: ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

లేటెస్ట్

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం

అవి ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం : తితిదే ఈవో శ్యామల రావు

08-01-2025 బుధవారం దినఫలితాలు : అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది...

హనుమాన్ చాలీసాతో అంతా జయమే

Tortoise: క్రిస్టల్ తాబేలును ఇంట్లో వుంచుకుంటే ఏం జరుగుతుంది? (video)

తర్వాతి కథనం
Show comments