Webdunia - Bharat's app for daily news and videos

Install App

28-11-2021 నుంచి 04-12-2021 వరకు వార ఫలితాలు

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (21:51 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. సన్నిహితులతో కాలక్షేపం చేయండి. వ్యాపతాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఓర్పు, పట్టుదలతో శ్రమించినగాని పనులు కావు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఖర్చులు అదుపులో ఉండవు. తప్పనిసరి చెల్లింపులు, ధరలు ఆందోళన కలిగిస్తాయి. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. దంపతుల మధ్య అవగాహన లోపం. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి. సంతానం చదువులపై శ్రద్ద వహించండి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. పత్రాల రెన్యువల్ లో మెలకువ వహించండి. బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
ఈ వారం ప్రతికూలతలు అధికం. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. పట్టుదలతో యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. వ్యవహారాలతో తీరిక ఉండడు. సన్నిహితుల సలహా పాటించండి. రాబోయే అదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ముఖ్య సమాచారం అందుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభయోగం. ప్రైవేట్ విద్యాసంస్థలకు కొత్త సమస్యలు ఎదువుతాయి. వృత్తుల వారికి సామాన్యం. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
ఆదాయం బాగుంటుంది. రోజు వారీ ఖర్చులే ఉంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. ఆది, సోమ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. మీ సాయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా మంచికేనని భావించండి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం, భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రిప్రజెంటేటికు సదవకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ప్రయాణం తల పెడతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1 2 3, 4 పాదములు 
వ్యవహారాలను సమర్థంగా నడిపిస్తారు. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ధనలాభం ఉంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. మంగళ, బుధ వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. చెల్లింపులు, పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. విద్యార్థులకు శుభయోగం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. వేడుకకు హాజరవుతారు. మీ రాక బంధువులకు సంతోషం కలిగిస్తుంది. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము 
అన్ని రంగాల వారికి శుభదాయకమే. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వాగ్దాటితో నెట్టుకొస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. అది, గురు వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఒక ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలం. 
 
కన్య : ఉత్తర 2 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
మీ కష్టం ఫలిస్తుంది. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. వ్యవహారానుకూలత ఉంది. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. బుధవారం నాడు పెద్ద ఖర్పు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆహ్వానం అందుకుంటారు. అయిన వారి గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆహ్వానం అందుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. గృహమార్పు అనివార్యం. గురు, శుక్ర వారాల్లో పత్రాలు, వస్తువులు జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తుల కలయిక ఉల్లాసాన్నిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. సహోద్యోగులతో వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. కార్మికులకు పనులు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. ఆశావహదృక్పథంతో మెలగండి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆదాయం సంతృప్తికరం. రోజు వారీ ఖర్చులే ఉంటాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. శనివారం నాడు ముఖ్యుల సందర్శనం వీలుపడదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. విద్యార్థులకు ఒత్తిడి అధికం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 123 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. అప్రమత్తంగా ఉండాలి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బందిగా ఉంటుంది. సాయం అర్థించేందుకు మనస్కరించదు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. అది, సోమవారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. దంపతుల మధ్య అకారణ కలహం. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి, ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు ధనప్రలోభం తగదు. సేవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. అపరిచితులతో జాగ్రత్త. అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. బుధ, గురువారాల్లో పత్రాలు, వస్తువులు జాగ్రత్త. సంప్రదింపులకు అనుకూలం. ఆచితూచి వ్యవహరించాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. గృహమార్పు నిదానంగా సత్ఫలితమిస్తుంది. నిరుద్యోగులకు ఆశాజనకం. ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కష్టకాలం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు 
మీ కష్టం ఫలిస్తుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు వేగవంతమవుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. జాతక పొంతన ప్రధానం. మంగళవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. ఉపాధి పథకాలు చేపడతారు. ఆరోగ్యం సంతృప్తికరం. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
ఆర్థికంగా పురోగమిస్తారు. రుణ సమస్యలు తొలగుతాయి. ఖర్చులు సామాన్యం. మానసికంగా కుదుటపడతారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. సావదానంగా పనులు పూర్తి చేస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. వ్యవహారాల్లో మెలకువ వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. పెద్దల సలహా పాటించండి. శుక్ర, శనివారాల్లో ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. గృహమార్పు కలిసివస్తుంది. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. సోదరీ సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వేడుకకు హాజరవుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: భర్తను చెల్లెలి సాయంతో హత్య చేసిన భార్య.. ఎందుకు ?

జనవరి 31 నుంచి అరకు ఉత్సవాలు.. మూడు రోజుల జరుగుతాయ్

తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి: కొండా సురేఖ

కుమార్తె వచ్చాకే డాక్టర్ మన్మోహన్ అంత్యక్రియలు...

అన్నీ చూడండి

లేటెస్ట్

24-12-2024 మంగళవారం దినఫలితాలు : ఆప్తుల సలహా పాటిస్తారు...

23-12-2024 సోమవారం దినఫలితాలు-పొగిడే వ్యక్తులతో జాగ్రత్త

22-12-2024 ఆదివారం దినఫలితాలు - రుణ సమస్యలు తొలగిపోతాయి..

Weekly Horoscope: 22-12-2024 నుంచి 28-12-2024 వరకు ఫలితాలు- మీ మాటలు చేరవేసే వ్యక్తులు?

21-12-2024 శనివారం దినఫలితాలు : ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి...

తర్వాతి కథనం
Show comments