Webdunia - Bharat's app for daily news and videos

Install App

01-01-2022 నుంచి 31-01-2022 వరకూ మీ రాశి ఫలితాలు

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (23:58 IST)
మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
అన్ని రంగాల వారికి ఆశాజనకం. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. గృహం సందడిగా వుంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసిరాగలదు. జాతక పొంతన ప్రధానం. మీ ఇష్టాయిష్టాలను పెద్దల ద్వారా తెలియజేయండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది. కళాత్మక పోటీల్లో మహిళలు రాణిస్తారు. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. వేడుకల్లో పాల్గొంటారు. ప్రయాణంలో అవస్థలు తప్పవు.

 
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఈ మాసం అనుకూలతలు అంతంతమాత్రమే. కార్యసిద్ధికి ఓర్పు, పట్టుదల ప్రధానం. మీ సమర్థత మరొకరికి కలిసివస్తుంది. ఆదాయం బాగున్నా సంతృప్తి వుండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. ఖర్చులు విపరీతం. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ఇతరులను మీ విషయాలకు దూరంగా వుంచండి. సందేశాలు, ప్రకటనలను విశ్వసించవద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఆందోళన కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. అప్రమత్తంగా వుండాలి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మీ శ్రీమతి సలహా పాటించండి. ఉద్యోగస్తులకు పనిభారం. వ్యాపారాల్లో పురోగతి, అనుభవం గడిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉపాధి పథకాలు చేపడతారు. జూదాల జోలికి పోవద్దు. 

 
మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ ఓర్పునకు పరీక్షా సమయం. కొంతమంది వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనం పాటించండి. లౌక్యంగా వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఉన్నతిని చాటుకోవడానికి విపరీతంగా వ్యయం చేస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. గృహం ప్రశాంతంగా వుంటుంది. ఆప్తులను వేడుకలు, విందులకు ఆహ్వానిస్తారు. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. అతిగా శ్రమించవద్దు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.

 
కర్కాటక రాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి వుంటుంది. చీటికిమాటికి అసహనం చెందుతారు. స్థిమితంగా వుండటానికి ప్రయత్నించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఆప్తుల హితవు మీపై సత్ర్పభావం చూపుతుంది. ఆహ్వానం అందుకుంటారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఓర్పుతో మెలగండి. గృహమార్పు అనివార్యం. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. వస్త్ర, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు ధనప్రలోభం తగదు. క్రీడా, కళాత్మక పోటీల్లో పాల్గొంటారు.

 
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ మాసం యోగదాయకమే. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా వుంటుంది. ఆదాయం వ్యయాలు సంతృప్తికరం. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పరిచయాలు బలపడతాయి. వ్యహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులను ఓ కంట కనిపెట్టండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. షాపుల అలంకరణ ఆకట్టుకుంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కళాత్మక పోటీల్లో మహిళలు విజయం సాధిస్తారు. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.

 
కన్యారాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మీదైన రంగాల్లో రాణిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులను ఆకట్టుకుంటారు. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులుంటాయి. డబ్బుకు ఇబ్బంది వుండదు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. సంతానం దూకుడును అదుపుచేయండి. వాస్తుకు అనుగుణంగా గృహమార్పులు చేపడతారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఉభయ వర్గాలకు మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. జాతక పొంతన ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. కళ, క్రీడా పోటీల్లో పాల్గొంటారు.

 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాలు అనుకూలిస్తాయి. లక్ష్యం సాధిస్తారు. ధనలాభం వుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. గృహం ప్రశాంతంగా వుంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా వుంచండి. సందేశాలు, ప్రకటనలు విశ్వసించవద్దు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వేడుకను ఘనంగా చేస్తారు. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకోవలసి వస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఏది జరిగినా మంచికేనని భావించండి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు హోదామార్పు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. నిరుద్యోగులకు సదవకాశం లభిస్తుంది. ప్రయాణంలో ఒకింత అవస్థలు తప్పవు.

 
వృశ్చిక రాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
అన్ని విధాలా శుభదాయకమే. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పురస్కారాలు అందుకుంటారు. గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. విదేశాల నుంచి సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. ఖర్చులు అదుపులో వుండవు. మీ ఉన్నతిని చాటుకోవడానికి విపరీతంగా వ్యయం చేస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. మీ ఇష్టాయిష్టాలను పెద్దల ద్వారా తెలియజేయండి. ప్రముఖుల సందర్శనం అనుకూలిస్తుంది. కళాత్మక పోటీల్లో మహిళలు రాణిస్తారు. వ్యాపరాలు లాభసాటిగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.

 
ధనస్సు రాశి: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రతికూలతలు అధికం. చాకచక్యంగా వ్యవహరించాలి. ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవకాశాలు కలిసివస్తాయి. రావలసిన ఆదాయం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. కొత్త పరిచయాలేర్పడతాయి. దంపతుల మధ్య అకారణ కలహం. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. గృహమరమ్మతులు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. క్రీడా, కళాత్మక పోటీలు ఉల్లాసాన్నిస్తాయి. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.

 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. రుణ సమస్యలు వేధిస్తాయి. దుబారా ఖర్చులు విపరీతం. ఆలోచనలతో సతమతమవుతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. పెద్దల జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. మానసికంగా కుదుటపతారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. అందరితో మితంగా సంభాషించండి. వేడుకకు హాజరవుతారు. ఆరోగ్యం సంతృప్తికరం. నిర్మాణాలు వేగవంతమవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సేవా, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. రవాణా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రయాణంలో జాగ్రత్త. 

 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2 పాదాలు
సంప్రదింపులతో తీరిక వుండదు. ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. పట్టుదలతో శ్రమించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చేతిలో ధనం నిలవదు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త పనులు చేపడతారు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. ఇతురల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. పందాలు, జూదాల వల్ల నష్టాలు తప్పువు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

 
మీనరాశి: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఈ మాసం శుభదాయకం. ఆదాయం బాగుంటుంది. స్థరాస్తి మూలకధనం అందుకుంటారు. ఖర్చులు అధికం. వేడుకలు, విలాసాలాకు విపరీతంగా వ్యయం చేస్తారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు, పనులు అప్పగించవద్దు. ప్రకటనలు, సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. నూతన పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు హోదా మార్పు. వైద్య, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. క్రీడ, కళాత్మక పోటీల్లో ఉల్లాసం కలిగిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Srinivas Goud: తిరుమల కొండపై టీటీడీ వివక్ష చూపుతోంది.. ఇది సరికాదు.. శ్రీనివాస్ గౌడ్ (video)

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవద్దని అమ్మకే ఫోన్ చేశారు.. గుడివాడ అమర్‌నాథ్ (video)

Folk Singer: ప్రేమ పెళ్లి బాగానే జరిగింది.. కానీ జానపద గాయని ఆత్మహత్య.. ఎందుకు?

Money Hunt challenge: ఓఆర్ఆర్‌లో మనీ హంట్ ఛాలెంజ్.. ఇన్‌స్టా కంటెంట్ క్రియేటర్ అరెస్ట్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

Weekly Horoscope : 15-12-2024 నుంచి 21-12-2024 వరకు మీ రాశిఫలాలు

Today Daily Astro 14-12-2024 శనివారం దినఫలితాలు

తర్వాతి కథనం
Show comments