Webdunia - Bharat's app for daily news and videos

Install App

26-05-2004 నుంచి 01-06-2024 వరకు మీ వార రాశిఫలాలు

రామన్
శనివారం, 25 మే 2024 (21:37 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒత్తిళ్లకు లొంగవద్దు. ఆదాయవ్యయాలకు పొంతన ఉండదు. ఆదివారం నాడు పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. సాయం అర్థించేందుకు మనస్కరించదు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. బంధువుల ఆకస్మిక రాక అసౌకర్యం కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. సన్నిహితుల చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సంతానం యత్నాలు ఫలిస్తాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు 
ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. త్వరలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఆప్తులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. నోటీసులు అందుకుంటారు. పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. తలపెట్టిన పనులు ఆపవద్దు. కృషి త్వరలో ఫలిస్తుంది. మంగళవారం నాడు విలువైన వస్తువులు జాగ్రత్త. అయిన వారితో సంభాషిస్తారు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా తెలియజేయండి. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. హోల్‌సేల్, చిరు వ్యాపారులకు కష్టకాలం. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శుభవార్తలు వింటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. కీలక అంశాలపై దృష్టి సారిస్తారు. ఒక సమాచారం ఉత్తేజాన్నిస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. కొంతమొత్తం పొదుపు చేయగల్గుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగకుండా మెలగండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్లు వదిలేయండి. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వేడుకలు, విందులకు హాజరవుతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. లక్ష్యసాధన దిశగా అడుగులేస్తారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. తొందరపాటు నిర్ణయాలు తగవు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆస్తులకు సంబంధించిన ధనం అందుతుంది. ధనం మంచినీళ్ల వలే ఖర్చవుతుంది. డబ్బుకు లోటుండదు. కీలక అంశాలపై ఆసక్తి పెంపొందుతుంది. అయిన వారితో సంభాషిస్తారు. ఆగిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. అవివాహితులకు శుభయోగం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహ అలంకరణల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పనిభారం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అసాంఘిక కార్యక్రమాల జోలికిపోవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ వారం గ్రహబలం కొంతమేరకు అనుకూలం. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కార్యం సిద్ధిస్తుంది. ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు విషయంలో జాగ్రత్త వహించండి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ప్రలోభాలకు లొంగవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. కీలక అంశాలపై దృష్టి సారిస్తారు. నోటీసులు అందుకుంటారు. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఓర్పుతో ఉద్యోగయత్నాలు సాగించండి.. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ధార్మికత పెంపొందుతుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లక్ష్యసాధకు శ్రమిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. శనివారం నాడు దంపతుల మధ్య అకారణ కలహం. సామరస్యంగా మెలగండి. పరిస్థితులు నిదానంగా సర్దుకుంటాయి. ఇంటి విషయాలు పట్టించుకోండి. ఆప్తులతో సంభాషిస్తారు. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. గృహమార్పు అనివార్యం. అనవసర జోక్యం తగదు. మీ గౌరవం కాపాడుకోండి. విలువైన వస్తువులు జాగ్రత్త. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పనిభారం, అధికారులకు ఆందోళన. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. న్యాయవాదులకు ఆదాయాభివృద్ధి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. వ్యవహారాలను సమర్ధంగా నిర్వహిస్తారు. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఆది, సోమవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. మానసికంగా స్థిమితపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్ధంలో ఏకాగ్రత వహించండి. తొందరపడి హామీలివ్వవద్దు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నిరుద్యోగులకు సదవకాశం లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
గ్రహాల సంచారం అనుకూలించదు. ఆచితూచి అడుగేయాల్సిన సమయం. తొందరపాటు నిర్ణయాలు తగదు. పెద్దల సలహా పాటించండి. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులు కలిసిరావు. కీలక అంశాలపై దృష్టి పెడతారు. మంగళవారం నాడు ఆప్తుల కలయిక వీలుపడదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను క్షణం అందిపుచ్చుకోండి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పట్టుదలతో లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కార్యదీక్ష ప్రశంసనీయమవుతుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆడంబరాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. నూతన పెట్టుబడులు కలిసిరావు. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ఒంటెద్దు పోకడ తగదు. పెద్దల సలహా తీసుకోండి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. గురు, శుక్రవారాల్లో అపరిచితులతో జాగ్రత్త. మీ నుంచి విషయసేకరణకు కొంతమంది యత్నిస్తారు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. గృహమరమ్మతులు చేపడతారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. అవివాహితులకు శుభయోగం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వైద్యరంగాల వారికి పురోభివృద్ధి. ఉపాధి పథకాల్లో రాణిస్తారు. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. యత్నాలు కొనసాగించండి. సహాయం ఆశించవద్దు. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. కొత్త పనులు ప్రారంభిస్తారు. శనివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. సంతానం ఉన్నత చదువులపై శ్రద్ధ వహిస్తారు. ప్రకటనలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఆరోగ్యం జాగ్రత్త. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహింంచండి. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉన్నతాధికారులకు హోదా మార్పు. హోల్‌సేల్ వ్యాపారులకు చికాకులు అధికం. బిల్డర్లకు ఆదాయాభివృద్ధి. సాఫ్ట్వేర్ రంగ విద్యార్థులకు సదవకాశాలు లభిస్తాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రణాళిబద్ధంగా యత్నాలు సాగిస్తారు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి పొదుపునకు అవకాశం లేదు. సోమవారం నాడు వ్యతిరేకులతో జాగ్రత్త. కొంతమంది యత్నాలకు ఆటంకాలు కలిగిస్తారు. ఓర్పుతో మెలగండి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. మీ చొరవతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. ఉపాధ్యాయులకు కొత్త చికాకులు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు స్థానచలనం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. వాహనసౌఖ్యం పొందుతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఆదాయవ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. సన్నిహితులు సాయం అందిస్తారు. ఆది, మంగళవారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సోదరులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. మీ జోక్యం అనివార్యం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. మీపై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. కీలక అంశాలపై దృష్టిసారిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Srinivas Goud: తిరుమల కొండపై టీటీడీ వివక్ష చూపుతోంది.. ఇది సరికాదు.. శ్రీనివాస్ గౌడ్ (video)

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవద్దని అమ్మకే ఫోన్ చేశారు.. గుడివాడ అమర్‌నాథ్ (video)

Folk Singer: ప్రేమ పెళ్లి బాగానే జరిగింది.. కానీ జానపద గాయని ఆత్మహత్య.. ఎందుకు?

Money Hunt challenge: ఓఆర్ఆర్‌లో మనీ హంట్ ఛాలెంజ్.. ఇన్‌స్టా కంటెంట్ క్రియేటర్ అరెస్ట్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

Weekly Horoscope : 15-12-2024 నుంచి 21-12-2024 వరకు మీ రాశిఫలాలు

Today Daily Astro 14-12-2024 శనివారం దినఫలితాలు

తర్వాతి కథనం
Show comments