Webdunia - Bharat's app for daily news and videos

Install App

09-03-2022 బుధవారం రాశిఫలాలు - గణపతిని పూజించినా మీకు శుభం..

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (04:00 IST)
మేషం :- ఆర్థిక వనరులను పెంపొందించుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరులకు పెద్ద మొత్తంలో రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన, మెళుకువ అవసరం. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. స్త్రీ కారణంగా చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. వాతావరణంలో మార్పు మీ పనులకు ఆటంకమవుతుంది.
 
వృషభం :- ఎండుమిర్చి కంది, పసుపు, ఉల్లి, బెల్లం వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. సజ్జన సాంగత్యం, సభలు, సమావేశాల్లో గౌరవం పొందుతారు. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. దైవ, సేవాకార్యాల పట్ల ఆకర్షితులవుతారు. పత్రికా సంస్థలోని వారికి చిన్నచిన్న పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది.
 
మిధునం :- ఉద్యోగస్తుల హోదా పెరిగే సూచనలున్నాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్న పనులుపూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల వైఖరిని సమీక్షించుకుంటారు. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయా లేర్పడతాయి. వృత్తుల వారికి ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. బంధువుల నిష్టూరాలు, పట్టింపులు ఎదుర్కోవలసి వస్తుంది.
 
కర్కాటకం :- వస్త్ర, బంగారు, వెండి రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. శాంతియుతంగా వ్యవహరిస్తేమీ సమస్యలు సానుకూలమవుతాయి. సోదరుల గురించి ఆందోళన చెందుతారు. భాగస్వామిక ఒప్పందాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది.
 
సింహం :- బంధువులను కలుసుకుంటారు. వ్యతిరేకులను సైతం మీ వైపునకు తిప్పుకుంటారు. మీ సంతానం కదలికలను గమనిస్తుండాలి. ప్రైవేట్ ఫైనాన్సులో మదుపు క్షేమంకాదు. ప్రతి వ్యవహారం మీకు అనుకూలంగానే ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోభివృద్ధి సంభవం. కోర్టు వాయిదాలు విసుగు కలిగిస్తాయి.
 
కన్య :- బ్యాంకు పనుల్లో ఏకాగ్రత అవసరం. వాహనం, విలువైన వస్తువులు మరమ్మతులకు గురవుతాయి. ఆశలొదిలేసుకున్న బకాయిలు వసూలవుతాయి. కళ, క్రీడ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. ఉద్యోగస్తులకు అధికారులతో చికాకులు ఎదురవుతాయి. మీ అభిప్రాయాలను సూచనప్రాయంగా తెలియజేయండి.
 
తుల :- స్త్రీ మూలకంగా వివాదాలు ఎదుర్కుంటారు. బంధువుల ఆకస్మికరాక ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారులు కొనుగోలుదార్లతో చికాకులు, సమస్యలు ఎదుర్కుంటారు. అధికారుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ప్రింటింగ్ రంగాల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. విజ్ఞతతో మీ ఆత్మాభిమానం కాపాడుకుంటారు.
 
వృశ్చికం :- ఉపాధ్యాయులు, ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. కొన్నిసార్లు తక్కువ వారి నుంచి సహాయం పొందవలసి వస్తుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు, శ్రమ అధికం. ప్రేమికుల వ్యవహారం వివాదాస్పదమవుతుంది.
 
ధనస్సు :- సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు సదావకాశాలు లభించగలవు. దంపతుల మధ్య దాపరికంకూడదు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనలతో మోసపోయే వీలుంది. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. విలువైన వస్తువులను పోగొట్టుకున్న వారికి అందించి మీ నిజాయితీని చాటుకుంటారు.
 
మకరం :- రాజకీయనాయకులు సభ, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. విదేశీ వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. చిన్నారుల, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయంలో ఖర్చులు అంచనాలు మించుతాయి. స్త్రీలకు దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. పెద్దమొత్తం నగదుతో ప్రయాణాలు క్షేమం కాదు.
 
కుంభం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. మితిమీరిన శారీరకశ్రమ వల్ల ఆరోగ్యములో ఇబ్బందులు తప్పవు. వాహనం ఏకాగ్రతతో నడపటం క్షేమదాయకం. వృత్తులవారు ఆదాయంకంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి చికాకు తప్పదు.
 
మీనం :- సందర్భం లేకుండా నవ్వడం వల్ల కలహాలు ఎదుర్కొవలసివస్తుంది. లిటిగేషన్, కోర్టు వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు క్లయింట్ల తీరు చికాకు పరుస్తుంది. ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments