Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

05-03-2022 శనివారం రాశిఫలాలు - అనంతపద్మనాభస్వామిని ఆరాధించడం...

05-03-2022 శనివారం రాశిఫలాలు - అనంతపద్మనాభస్వామిని ఆరాధించడం...
, శనివారం, 5 మార్చి 2022 (04:00 IST)
మేషం :- ఆసాధ్యమనుకున్న కేసులను సునాయాసంగా గెలుపొందుతారు. ఉపాధ్యాయులకు మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో పనులు మందకొడిగా సాగుతాయి. ఏ ప్రయత్నం కలిసి రాకపోవటంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. పెద్దల ఆహార, ఆరోగ్య వ్యవహారాలలో మెళుకువ అవసరం.
 
వృషభం :- నిత్యవసర వస్తు స్టాకిస్తులకు, రేషన్ డీలర్లకు చికాకులు తప్పవు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. మీ ఉన్నతి చాటుకోవడం కోసం ధనం బాగా ఖర్చుచేస్తారు. ఉద్యోగస్తులు తోటివారితో విందు, వినోదాలలో పాల్గొంటారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు.
 
మిథునం :- మీ శ్రీమతి సలహాను తేలికగా కొట్టివేయకండి. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో మాట పడటం వంటివి ఎదుర్కొంటారు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. బంధువుల ఆకస్మిక రాకతో గృహంలో ఖర్చులు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
కర్కాటకం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. రవాణా రంగంలో వారికి సంతృప్తి కానరాగలదు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు చోటుచేసుకుంటాయి.
 
సింహం :- నూనె, మిర్చి, కంది స్టాకిస్టు వ్యాపారస్తులకు అనుకూలింగానే ఉంటుంది. వృత్తులవారు ఆదాయం కంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి.
 
కన్య :- స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడివల్ల ఆందోళనలకు గురవుతారు. స్త్రీలు వీలైనంత వరకు మితంగా సంభాషించడం మేలు. బ్యాంకింగ్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించిన జారవిడుచుకుంటారు.
 
తుల :- కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించవలసి ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలం. బంధువులకు ధన సహాయం చేయడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. రాబడికి మించి ఆర్థిక విషయాల పట్ల దృష్టి సాగిస్తారు. ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించు నపుడు జాగ్రత్త వహించండి.
 
వృశ్చికం :- సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక ఫలిస్తుంది. ప్రైవేటు సంస్థల వారికి, రిప్రజెంటివ్‌లకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం.
 
ధనస్సు :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. కళత్ర ఆరోగ్యంలో గురించి ఆందోళన చెందుతారు. వ్యాపార వర్గాల వారికి పనివారలతో చికాకులు వంటివి ఎదుర్కొంటారు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది. ప్రియతముల రాక మీకు ఎంతో సంతృప్తినిస్తుంది.
 
మకరం :- గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. ఉన్నత విద్య, పరిశోధనలు, చర్చలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. రాజకీయాలలో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. ఇర్చులు మీ అంచనాలను మించటంతో ఒకింత ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
కుంభం :- మీ ఓర్పు, విజ్ఞతకు ఇది పరీక్షా సమయమని గమనించండి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుటవలన మాట పడవలసి వస్తుంది. స్త్రీలకు చాలా యోగప్రదంగా వుండగలదు.
 
మీనం :- బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు సంభవిస్తాయి. విదేశీయానం కోసం చేసే యత్నాలకు అడ్డంకులు తొలగిపోగలవు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు చికాకులు, నిరుత్సాహం వంటివి తలెత్తుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

04-03-2022 శుక్రవారం రాశిఫలాలు - లక్ష్మీదేవిని పూజించి, అర్చించిన శుభం..