Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

01-03-2022 మంగళవారం దినఫలాలు - ఈశ్వరునికి అభిషేకం చేయించిన...

Advertiesment
01-03-2022 మంగళవారం దినఫలాలు - ఈశ్వరునికి అభిషేకం చేయించిన...
, మంగళవారం, 1 మార్చి 2022 (04:00 IST)
మేషం :- ఆర్థిక ఇబ్బందులు లేకున్నా వెలితిగా అనిపిస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. వ్యాపారాల్లో అనుభవం, ఆశించినలాభాలు గడిస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.
 
వృషభం :- దైవ సేవా కార్యమాలలో చురుకుగా పాల్గొంటారు. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. కొత్త పరిచయాల వల్ల లబ్ది పొందుతారు. ప్రయాణాలు సజావుగా సాగినా లక్ష్యం నెరవేరదు. బంధుమిత్రులను కలుసుకుంటారు. మీడియా రంగాల వారు పనిభారం, ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
 
మిథునం :- ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రుణ బాధలు, దీర్ఘ కాలిక సమస్యలు క్రమేణా సర్దుకుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి. వసతి ఏర్పాట్ల విషయంలో చిక్కులు ఎదువవుతాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు చుట్టుముడతాయి.
 
కర్కాటకం :- వృత్తి వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. నిరుద్యోగులు చేపట్టన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యులలో ఒకరి గురించి ఆందోళన చెందుతారు. మిత్రులపై ఉంచిన నమ్మకం వమ్యు అయ్యే ఆస్కారం ఉంది. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తప్పవు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు ఏకాగ్రత ముఖ్యం.
 
సింహం :- విద్యుత్ రంగాల వారికి పనిలో ఒత్తిడి అధికమవుతుంది. ప్రభుత్వ సంస్థల్లో వారికి ఆశించినంత గుర్తింపు లభించదు. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. శాస్త్ర, సాంకేతిక, బోధనా సిబ్బందికి సదవకాశాలు లభిస్తాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు.
 
కన్య :- ఆర్థిక ఇబ్బందులు లేకున్నా ఏదో అసంతృప్తి వెన్నాడుతుంది. కొంతమంది ముఖ్యమైన విషయాలలో మిమ్మల్ని సంప్రదిస్తారు. పాత రుణాలు తీరుస్తారు. అవసరమైన వస్తువులు సమయానికి కనిపించకపోవచ్చు. ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు తప్పవు.
 
తుల :- విద్యార్ధులకు స్నేహ బృందాలు విస్తరిస్తాయి. దైవ, పుణ్య సేవా కార్యాల పట్ల మరింతగా ఆసక్తి పెంచుకుంటారు. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వాహనం నడుపునప్పుడు జాగ్రత్త అవసరం.
 
వృశ్చికం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులు తప్పవు. వ్యాపార వర్గాల వారికి పెద్దమొత్తంలో చెక్కులిచ్చే విషయంలో పునరాలోచన మంచిది. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు.
 
ధనస్సు :- రాజకీయ నాయకులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు ఏమంత సంతృప్తినీయవు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు.
 
మకరం :- ఏ విషయంలోను వాదించకుండా రాజీమార్గం అనుసరించండి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. ప్రకటనలు, రాజకీయ కళా రంగాల వారికి ప్రోత్సహకరం. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు.
 
కుంభం :- రావలసిన ధనం అందటంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించిన ఫలితం పొందుతారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్య క్షేత్రం సందర్శిస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
 
మీనం :- న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రయాణాల్లో ఒకింత అసౌకర్యానికి లోనవుతారు. రాజీమార్గంలో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలు పట్టుదలతో శ్రమించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రుద్రభూమి గోకర్ణం, ఎందుకని?