Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

28-02-2022 సోమవారం రాశిఫలితాలు - మల్లికార్జునుడిని ఆరాధించిన...

Advertiesment
Daily Horoscope
, సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (04:00 IST)
మేషం :- వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. అకాల భోజనం, మితిమీరిన శ్రమ వల్ల అస్వస్థకు గురవుతారు. రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల మాటపడవలసి వస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృషభం :- ప్లీడర్లకు ఒత్తిడి, అకౌంట్స్ రంగాల   వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. సోదరులతో అవగాహన లోపిస్తుంది. పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా ఖర్చుచేస్తారు.
 
మిథునం :- కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు అన్నివిధాలా కలిసిస్తుంది. ఇంటర్వ్యూలలోజయం మిమ్మల్ని వరిస్తుంది. గృహంలో నెలకొన్న అశాంతి తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. పోస్టల్, కొరియర్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. పత్రిక, మీడియా సంస్థల వారు అకారణంగా మాటపడవలసి వస్తుంది.
 
కర్కాటకం :- ప్రభుత్వ కార్యాలయాల్లో వసులు మందకొడిగా సాగుతాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలను ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటంతో పాటు అనుభవం గడిస్తారు. మిత్రుల కలయికతో మనసు కుదుటపడుతుంది. స్త్రీల ప్రతిభకు తగిన గుర్తింపు, అవకాశాలు లభిస్తాయి.
 
సింహం :- ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. ఇతరుల స్థితిగతులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. గత కొంతకాలంగా ఆగిన పనులు పునఃప్రారంభించారు. దైవారాధన పట్ల ఆశక్తి పెరుగుతుంది.
 
కన్య :- కిరణా, ఫాన్సీ, రసాయన, సుగంధద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఒత్తిడి, చికాకులు తప్పవు. విద్యార్థులు విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహించిన సత్ఫలితాలు పొందగలరు. గత అనుభావాలు జ్ఞప్తికి రాగలవు. స్త్రీలు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు.
 
తుల :- ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి జాయింట్‌ వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.
 
వృశ్చికం :- ఆర్థిక ఇబ్బంది కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలు తీరుతాయి. బ్యాంక్ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ప్రతి విషయంలో మౌనం వహించడం మంచిదని గమనించండి. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది.
 
ధనస్సు :- సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో చికాకులు తప్పవు.
 
మకరం :- ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. మీ అభిప్రాయాలను సూచన ప్రాయంగా వ్యక్తం చేయండి. ప్లీడర్లకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి.
 
కుంభం :- వృత్తిపరంగా ఎదురైన సమస్యలు క్రమేణా తొలగిపోగలవు. మీ బాధ్యతలను ఇతరులకు అప్పగించటం మంచిది కాదు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావలసి ఉంటుంది. బంధువులను కలుసుకుంటారు.
 
మీనం :- ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటుంది. రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పవు. మీ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటు చేసుకుంటాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహాశివరాత్రి మార్చి 1: బ్రహ్మాండమే ఒక శివలింగం