Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

03-03-2022 గురువారం రాశిఫలాలు - వరసిద్ధి వినాయకుడిని ఆరాధించిన...

Advertiesment
Daily Horoscope
, గురువారం, 3 మార్చి 2022 (04:00 IST)
మేషం :- ఉపాధ్యాయులకు అధికారుల నుంచి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, తగిన అవకాశం లభిస్తుంది. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులకు అనుకూలం. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు చికాకులు వంటివి తలెత్తుతాయి. విదేశీయానానికి కావలసిన పాస్‌పోర్టు, వీసాలు అందుకుంటారు.
 
వృషభం :- ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వృత్తుల వారికి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. ఏజెంట్లు, రిప్రజెంటేటిన్లు టార్గెట్లను పూర్తి చేస్తారు. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. పెద్దమొత్తం ధనం, విలువైన వస్తువులతో ప్రయాణం క్షేమంకాదు.
 
మిథునం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహరాలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు అధికం. పొగడ్తలు, ప్రలోభాలకు దూరంగా ఉండాలి. వ్యాపారాల్లో ఆటంకాలను అధికమించి అనుభవం గడిస్తారు. అధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ధ్యాస వహిస్తారు. మీ శ్రీమతి హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది.
 
కర్కాటకం :- దైవ, సేవాకార్యక్రమాల్లో ఏకాగ్రత వహిస్తారు. సొంతంగాగాని, భాగస్వామ్యంగాగాని చేసిన వ్యాపారాలు కలిసివచ్చును. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. స్థిరాస్తి అమ్మటానికి చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావలసి ఉంటుంది.
 
సింహం :- రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, ఇన్వెస్టర్ రంగాల వారికి పురోభివృద్ధి. ఓర్పు, రాజీధోరణితో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. స్త్రీలు దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
 
కన్య :- బంధు మిత్రులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటాంరు. ఉమ్మడి, సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. తల పెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా నెమ్మదిగా సమసి పోగలవు. నిరుద్యోగులకు ప్రముఖుల సిఫార్సుతో సదావకాశాలు లభిస్తాయి.
 
తుల :- ఆర్థిక వ్యవహారాలలో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు ఆరోగ్య, ఆహార వ్యవహారాల్లో మెళకువ అవసరం. ఒక నష్టాన్ని మరొక విధంగా పూడ్చుకుంటారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం.
 
వృశ్చికం :- విదేశీ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికివస్తాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలు తమ సరదాలు, కోరికువాయిదా వేసుకుంటారు.
 
ధనస్సు :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. కోర్టు వ్యాజ్యాలను ఉపసంహరించుకుంటారు. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. మీ అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు సమయం కలిసివస్తుంది.
 
మకరం :- అతిథి మర్యాదలు బాగుగా నిర్వహించుట వల్ల మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు ఉద్యోగయత్నంలో బిడియం, భేషజం తగవు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు కలసిరాగలవు. కోర్టు వ్యాజ్యాలను ఉపసంహరించుకుంటారు.
 
కుంభం :- వ్యాపార వర్గాల వారికి పెద్దమొత్తంలో చెక్కులిచ్చే విషయంలో పునరాలోచన మంచిది. ప్రముఖులను కలుసుకుంటారు. కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర, బంగారం వ్యాపారులకు పురోభివృద్ది. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.
 
మీనం :- స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు. నిరుద్యోగులు ఇంటర్వూలలో జయం పొందుతారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. చివరి క్షణంలో చేతిలో ధనం ఆడక ఇబ్బందులు కొన్ని తెచ్చుకుంటారు. హోటలు, తినుబండ రంగాలలో వారికి చికాకులు తలెత్తుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమావాస్య రోజు సాయంత్రం ఎరుపు వత్తులతో.. నది వద్ద దీపాలు పెడితే?