Webdunia - Bharat's app for daily news and videos

Install App

05-09-2021 ఆదివారం దినఫలాలు - ఆదిత్యుడిని పూజించినా...

Webdunia
ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (04:00 IST)
మేషం : ఉపాధ్యాయులు సన్మానాలు అందుకుంటారు. చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారులకు అభివృద్ధి కానరాగలదు. ప్రేమికుల మధ్య అవగాహనా లోపం వల్ల ఊహించని పరిణామాలు సంభవిస్తాయి. తలపెట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా సంతృప్తికరంగా పూర్తికాగలవు. ఆలయాలను సందర్శిస్తారు.
 
వృషభం : భాగస్వామిక చర్చలు, వాణిజ్య ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులకు బహుమతులను అందుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. మీ యత్నాలకు సన్నిహితులు అన్ని విధాలా సహకారం అందిస్తారు. కాంట్రాక్టర్లు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. 
 
మిథునం : దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొబ్బరి, పండ్లు, పూల కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపిస్తుంది. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
కర్కాటకం : నూతన పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. సినీ కళాకారుల వల్ల రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటాయి. రాబడి బాగున్నప్పటికీ ఏదో ఒక ఖర్చు తగలడంతో పొదుపు సాధ్యంకాదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు ఉల్లాసంగా గడుపుతారు. 
 
సింహం : ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. స్త్రీల అభిప్రాయాలకు ఆమోదం లభించక పోవడంతో కుటుంంలో చికాకులు తలెత్తుతాయి. నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు గణనీయమైన అభివృద్ధి ఉంటుంది. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. 
 
కన్య : ఊహించని వ్యక్తుల నుంచి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది. పెరిగే ఖర్చులు, అవసరాలు మీ రాబడికి మించడంతో ఆందోళన, నిరుత్సాహ అధికమవుతాయి. వ్యాపార, ఆర్థికాభివృద్ధికి చేయు కృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. 
 
తుల : వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. ఓర్పు, నేర్పులతో మీరు అనుకున్నది సాధిస్తారు. రావలసిన మొండిబాకీలు సైతం వసూలు కాగలవు. ముఖ్యుల కోసం ధన వయ్యం చేస్తారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉన్నత ఉద్యోగులకు డిప్యుటేషన్ పై విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. 
 
వృశ్చికం : విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తుల సమర్థత, ప్రతిభకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. మంచితనంతో విరోధులను ఆకట్టుకుంటారు. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. 
 
ధనస్సు : ప్రైవేటు, పత్రికా సంస్థల్లో వారికి మార్పులు వాయిదాపడతాయి. బంధు మిత్రుల కలయికతో నూతన ఉత్సాహం కానవస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఆరోగ్యంలో మెళకువ వహించండి. కార్యసిద్ధిలో అనుకూలత, చేపట్టిన పనులు వేగవంతమవుతాయి. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మకరం : స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. తీర్థయాత్రలు, విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. గృహంలో మార్పులు వాయిదాపడతాయి. మీ మేలు కోరని వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. 
 
కుంభం : ఆర్థిక విషయాలలో ఒకింత పురోగతి కనిపిస్తుంది. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు, నెరవేరగలవు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. నిరుద్యోగులలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది.
 
మీనం : స్త్రీలకు విలువైన వస్తువులు, ఆభరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రేమికుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ పాత సమస్యలు పరిష్కారం కాగలవు. స్థిరచరాస్తులకు సంబంధించి ముఖ్యులతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పెద్దల గురించి ఆందోళన తప్పదు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం...... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

Mother Thanks: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎసమ్మ అనే మహిళ.. ఎందుకు?

ఒంటిపూట బడులు.. ఉదయం 6.30 గంటలకే తరగతులు ప్రారంభం!!

అన్నీ చూడండి

లేటెస్ట్

19-03-2025 బుధవారం దినఫలితాలు : రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు

భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : తితిదే

TTD : జూన్ మాసపు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల.. వివరాలివే

18-03-2025 మంగళవారం దినఫలితాలు : ఆపన్నులకు సాయం అందిస్తారు...

17-03-2025 సోమవారం దినఫలితాలు -

తర్వాతి కథనం
Show comments