Webdunia - Bharat's app for daily news and videos

Install App

31-01-2022 సోమవారం రాశిఫలితాలు - మల్లికార్జునుడిని ఆరాధించిన..

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (04:00 IST)
మేషం :- వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీల మాటకు కుటుంబంలో మంచి స్పందన లభిస్తుంది. నిరుద్యోగ విదేశీ యత్నాలు ఫలిస్తాయి. రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేటు సంస్థల వారు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలించవు. విద్యార్థులకు నిరంతర కృషి అవసరమని గమనించండి.
 
వృషభం :- నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో ఏకాగ్రత అవసరం. తెలివి తేటలతో వ్యవహారించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఆలయ సందర్శనాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు పూర్తిచేస్తారు.
 
మిథునం :- ఉద్యోగమార్పిడికై చేయు యత్నాలు త్వరలోనే ఫలించగలవు. ఆలయ సందర్శనాలలో మిత్రులను కలుసుకుంటారు. ప్రైవేటు సంస్థల్లో వారికి అభివృద్ధి కానరాగలదు. ప్రయాణాల్లో సంతృప్తి కానవస్తుంది. అందరితో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు, పాత సమస్యలు చికాకు పరుస్తాయి. 
 
కర్కాటకం :- ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించడం కష్టం. వృత్తులు, క్యాటరింగ్ పనివారల ఆదాయం బాగుంటుంది. మీ వ్యక్తిగత భావాలను, సమస్యలను బయటికి వ్యక్తం చేయకండి. రాజకీయ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఓర్పు, పట్టుదలతో శ్రమించినగాని అనుకున్న పనులు పూర్తి కావు.
 
సింహం :- ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రేమానుబంధాలు, సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకు వవహించండి. ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి, చికాకు తప్పదు. వృత్తిపరంగా ఎదురైన చికాకులు అధికమిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు.
 
కన్య :- కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. మీ పట్టుదల, అంకితభావం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. ఆకస్మికంగా మీరు తీసుకున్న ఒక నిర్ణయం కుటుంబీకులను బాధించగలదు. విదేశాలు వెళ్ళటానికి చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. భార్య, భర్తల మధ్య మనస్పర్థలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు.
 
తుల :- ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. గత విషయాల గురించి ఆలోచిస్తూ కాలం వ్యర్థం చేయకండి. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. రావలసిన బకాయిలు సకాలంలో అందిన ధనం ఏమాత్రం నిల్వ చేయలేరు. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు మీరే చూసుకోవటం మంచిది.
 
వృశ్చికం :- స్థిరచరాస్తుల వ్యవహారాలలో కుటుంబీకుల మధ్య అవగాహన లోపిస్తుంది. ఎదుటి వారితో మితంగా సంభాషించటం మంచిది. విజ్ఞతతో వ్యవహరించి ఒక సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తారు. అయిన వారికి వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితులు నెలకొంటాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి.
 
ధనస్సు :- కాంట్రాక్టర్లకు అధికారుల నుండి ఒత్తిడి, కార్మికులతో చికాకులు తప్పవు. పట్టుదలతో శ్రమించి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసివస్తాయి. రాజకీయ నాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలోను ఏకాగ్రత ఎంతో ముఖ్యం.
 
మకరం :- వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో సఫలీకృతులవుతారు. విద్యార్థుల్లో మనోధైర్యం నెలకొంటుంది. పత్రికా రంగంలోని వారి ఏమరుపాటు వల్ల ఇబ్బందులు ర్కోవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం వంటి చికాకులు తప్పవు. మీ సంకల్పసిద్ధికి నిరంతర శ్రమ, పట్టుదల చాలా ముఖ్యమని గమనించండి.
 
కుంభం :- ఆర్థిక ఇబ్బంది లేకపోయినా సంతృప్తి ఉండజాలదు. మీరు చేసే పనులకు బంధువుల నుండి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. స్త్రీలతో కలహాలు, అన్ని కార్యముల యందు విఘ్నములు ఎదుర్కొంటారు. మానసిక ప్రశాంతత కోసం దేవాలయాలు సందర్శిస్తారు. మీ పథకాలు, ఆలోచనలు గోప్యంగా ఉంచటం మంచిది.
 
మీనం :- ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ప్లీడర్లకు, వైద్యరంగంలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. కొంతమంది మీ వ్యాఖ్యలను అపార్థం చేసుకునే ఆస్కారం ఉంది. బంధువుల రాక వల్ల మీ కార్యక్రమాల్లో అంతరాయం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఆశాజనకం. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

20-03-2025 గురువారం మీ రాశిఫలాలు : మీ సహనానికి పరీక్షా సమయం...

Ekakshi coconut: ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా..? అప్పుకు ఏకాక్షి నారికేళంతో చెక్?

Rang Panchami 2025: రంగులు సమర్పిస్తే.. దైవానుగ్రహం..

19-03-2025 బుధవారం దినఫలితాలు : రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు

భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : తితిదే

తర్వాతి కథనం
Show comments