Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

26-01-2022 బుధవారం రాశిఫలితాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన....

26-01-2022 బుధవారం రాశిఫలితాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన....
, బుధవారం, 26 జనవరి 2022 (04:00 IST)
మేషం :- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి శ్రమాధిక్యత తప్పదు. ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల ఒత్తిడి, చికాకులు తప్పవు. ఏవైనా చిన్నచిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. ప్లీడర్లకు, ప్లీడర్ గుమాస్తాలకు సకాలం. బాధ్యతలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చిరు వ్యాపారులకు లాభదాయకం.
 
వృషభం :- ఆర్థిక విషయాల్లో సహోద్యోగులు మొహమాట పెట్టే అవకాశం ఉంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. అందరకీ సహాయం చేసి మాటపడతారు. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ ఔదార్యాన్ని కొంతమంది దుర్వినియోగం చేసే అవకాశం ఉంది.
 
మిథునం :- స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. మీరు ఊహించిన దానికంటే అధికంగా వ్యయం అవుతుంది. గృహ మరమ్మతులు, పనులు పునఃప్రారంభిస్తారు.
 
కర్కాటకం :- స్త్రీల ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజార్చుకునే అవకాశం ఉంది. పాతఋణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. మార్కెటింగ్, ఉద్యోగాలకు టార్గెట్ పూర్తి కావడం కష్టతరమవుతుంది.
 
సింహం :- రవాణా రంగంలోని వారికి చికాకులు అధికమవుతాయి. మీ లక్ష్యసాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషి చేయండి. మీకు రాబోయేఆదాయానికి తగినట్లుగా ఖర్చులు సిద్ధిమవుతుంది. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ప్రేమికుల మధ్య అనుమానాలు తొలగిపోతాయి.
 
కన్య :- వాతావరణంలోని మార్పు రైతులకు ఆందోళన కలిగిస్తుంది. వాహనచోదకులకు ఇబ్బందులు తప్పవు, పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల వ్యవహరాలలో పునరాలోన అవసరం. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అసవరం.
 
తుల :- రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అనూహ్యమైన అవకాశలు దక్కుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు మెళుకువ అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో, వారికి సదవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, పరిస్థితుల అనుకూలతలు ఉంటాయి.
 
వృశ్చికం :- మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. తెలియని ఉత్సాహము ధైర్యము మీలో చోటుచేసుకుంటుంది. మీకు నచ్చని సంఘటనలుకొన్ని ఎదురుకావచ్చు. స్త్రీల అభిప్రాయాలకు వ్యతిరేకత ఎదురవుతుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
ధనస్సు :- ఆర్థిక ఇబ్బందులు లేకున్నా అసంతృప్తిగా ఉంటుంది. పత్రికా రంగంలోని వారికి నిరుత్సాహం తప్పదు. బంధువులను కలుసుకుంటారు. సేవా సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తారు. ఇతరుల సహాయం అర్థించటం వల్ల మీ గౌరవానికి భంగం కలుగవచ్చు. బ్యాంకు వ్యవహారాలలో మెళుకువ అవసరం.
 
మకరం :- సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. రాజకీయ, కళారంగాల వారికి సన్నానాలు జరుగుతాయి. ఇతరుల సహాయం ఆర్థించటం వల్ల మీ గౌరవానికి భంగం కలుగవచ్చు. రావలసిన మొండి బాకీలు ఆలస్యమైనకానీ వసూలవుతాయి.
 
కుంభం :- ఆర్థిక సమస్యలు మెరుగు పడతాయి. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి, స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వృత్తుల వారు ఆదాయం కంటె వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం.
 
మీనం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. మీ ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. బంధులతో తగాదాలు ఏర్పడువచ్చు. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ప్రముఖులను కలుసుకొని బహుమతులు అందజేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

25-01-2022 మంగళవారం రాశిఫలితాలు - కుబేరుడిని ఆరాధించిన ఆర్థికాభివృద్ధి