Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

25-01-2022 మంగళవారం రాశిఫలితాలు - కుబేరుడిని ఆరాధించిన ఆర్థికాభివృద్ధి

Advertiesment
Daily Horoscope
, మంగళవారం, 25 జనవరి 2022 (04:00 IST)
మేషం :- వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. విందు, వినోదాలలో పరిమితి పాటించండి. మీ శ్రీమతి, సంతానం సంతోషం కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
వృషభం :- అసంపూర్తిగా వదిలేసిన పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో అదనపు బరువు బాధ్యతలు అధికమవుతాయి. షాపు పనివారలు, కొనుగోలుదార్లతో లౌక్యంగా మెలగండి. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు, వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి.
 
మిథునం :- మీ రాక బంధుమిత్రులకు సంతోషం కలిగిస్తుంది. పెద్దలు, ఆత్మీయుల గురించి అప్రియమైన వార్తలు వినవలసి ఉంటుంది. ఆశావహదృక్పథంతో కొత్త యత్నాలు సాగిస్తారు. కొత్త ప్రయత్నాలు ఏమి చేయవద్దు. నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు స్వల్ప ఆటుపోట్లు తప్పవు. కోర్టు విషయాలలో సంతృప్తి కానవస్తుంది.
 
కర్కాటకం :- మీ సంతానం మొండివైఖరి ఎంతో చికాకు కలిగిస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శన నిమిత్తం అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు.
 
సింహం : - మీ శ్రీమతి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. విదేశాల నుంచి ఆప్తుల రాక సంతోషం కలిగిస్తుంది. దూరప్రయాణాలలో మెళుకువ అవసరం.
 
కన్య :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కని పెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వలన ఆరోగ్యం మందగిస్తుంది. వూహాత్మకంగా ముందుకుసాగి వ్యవహారాలు చక్కదిద్దుతారు. ధనాదాయం బాగున్నా గృహంలో ఖర్చులు అధికమవుతాయి. పాత బాకీలు వసూలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బంది తొలగుతుంది.
 
తుల :- కుంటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. మీలోని శక్తి సామర్థ్యాలు ద్విగుణీకృతమయ్యే అవకాశం దక్కుతుంది. టెక్నికల్ రంగంలోని వారు బాగా అభివృద్ధి చెందుతారు. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ధనం ఎంతవస్తున్న ఏమాత్రం నిలువ చేయలేక పోవుట వలన ఆందోళనకు గురి అవుతారు..
 
వృశ్చికం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు పనిభారం అధికమవుతుంది. ప్రియతములు ఇచ్చే సలహా మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. పూర్వపు అప్పులు కొన్నింటిని తీరుస్తారు. మిత్రులతో సఖ్యత కోసం ప్రయత్నిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ భావాలకు, రచనా పటిమకు మంచిగుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి.
 
ధనస్సు :- గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖికపరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపారాల్లో మొహమాటాలు, భేషజాలకు పోవడం మంచిది కాదు. స్త్రీలకు టి.వి. ఛానెళ్ళ కార్యక్రమాల సమాచారం అందుతుంది.
 
మకరం :- ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. అన్ని రంగాల వారికీ మొదట నిరాశ కలిగినా తర్వాత పురోభివృద్ధి, జయం పొందుతారు. కొబ్బరి, పూలు, పండ్లు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రతీ వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుందని గమనించండి.
 
కుంభం :- నిరుద్యోగులకు ఏ చిన్న అవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవటం మంచిది. స్త్రీలకు ఆరోగ్యభంగం, నీరసం వంటి చికాకులు అధికం. విందులు, వేడుకల్లో చురుకుగా పాల్గొంటారు. బంధు మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. పందాలు, పోటీలలో విజయం సాధిస్తారు. విందులలో పరిమితి పాటించండి.
 
మీనం :- మీ కుటింబీకులతో కలసి వేడుకల్లో పాల్గొంటారు. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకును కలిగిస్తుంది. సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనం కొనుగోలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ప్రముఖులకు శుభాకాంక్షలు అందజేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

24-01-2022 సోమవారం రాశిఫలితాలు - లలిత సహస్రనామ పారాయణం చేసిన శుభం..