Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని పూజించి - అర్చించిన శుభం

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (04:00 IST)
1-10-2021 శుక్రవారం శ్రీ ప్లవనామ సంII భాద్రపద బII దశమి రా.7.08 పుష్యమి రా.1231 ఉ.వ.7.27 ల 9.09. ఉదు.8.183 9.07 పుదు.12.20ల 1.08.
 
మేషం:- ఉద్యోగస్తులకు అడ్వాన్లు, బోనస్, సెలవులు మంజూరవుతాయి. దైవ దీక్షలు స్వీకరిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా సాగుతాయి. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్తయత్నాలు మొదలెడతలారు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులకు సదవకాశాలు చేజారిపోతాయి. 
 
వృషభం:- బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కుంటారు. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మికులతో సమస్యలు తలెత్తుతాయి. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది.
 
మిధునం:- మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులకు పదవీయోగం, ధనలాభం. ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుంది. ఊహించని ఖర్పులు మీ అంచనాలు దాటవచ్చును. కంపెనీ సమావేశాలలో మీకు గతానుభవం ఉపయోగపడుతుంది. వ్యాపారాభివృద్ధికి బాగా శ్రమించాల్సి ఉంటుంది.
 
కర్కాటకం:- మీడియా రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టం మ్మీద పూర్తి చేస్తారు. మీకు నచ్చిన విషయాలపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది.
 
సింహం:- పొట్ట, నరాలకు సంబంధించిన సమస్యలు అధికమవుతాయి. పోస్టల్, కొరియర్ రంగాల వారికి పనిభారం తప్పవు. కొబ్బరి, పండ్ల, పూల, రసాయన, సుగంధ ద్రవ్యవ్యారులకు పురోభివృద్ధి. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. విజ్ఞతతో వ్యవహారించి రుణదాతలను సమాధానపరుస్తారు.
 
కన్య:- ఉద్యోగస్తులు ఏకాగ్రత లోపం వల్ల మాటపడవలసి వస్తుంది. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి. రవాణా రంగాల వారికి చికాకులు తప్పవు. పెద్దల ఆరోగ్యం మెళుకువ అవసరం. విదేశాల్లోని అయిన వారి క్షేమ సమాచారాలు సంతృప్తినిస్తాయి. లాయర్లకు నిరుత్సాహం కానవస్తుంది. 
 
తుల:- ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానరాదు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. దూర ప్రయాణాల్లో వస్తువులపట్ల మెళుకువ అవసరం. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా కాలం గడుపుతారు. క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు.
 
వృశ్చికం:- విదేశాయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలు ఎదుర్కుంటారు. వస్త్ర, బంగారం, వెండి, వ్యాపారులకు పురోభివృద్ధి. సన్నిహితుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. ఊహించని ప్రయాణాలు సంభవం. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
 
ధనస్సు:- ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. ఆరోగ్య ఆహార వ్యవహారాలలో మెలకువ అవసరం. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మార్కెటింగ్ రంగాల వారికి పెద్ద సంస్థల నుండి అవకాశాలు లభిస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
మకరం:- ప్రైవేటు, పత్రికా సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం చాలా ముఖ్యం. మీ శ్రమకు, నైపుణ్యతకు యాజమాన్యం నుండి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉపాధ్యాయులకు, ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది.
 
కుంభం:- వైద్యులకు ఏకాగ్రత అవసరం. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. చేపట్టిన స్వయం ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగటంతో పాటు మీ యత్నం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని మార్పులు అనుకూలించవు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. 
 
మీనం:- ఉద్యోగస్తుల శ్రమ, కార్యదీక్షకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదు. ఆర్ధిక లబ్ధి వంటి శుభపరిణామాలు ఉంటాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టులు దక్కించుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించటం మంచిది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

లేటెస్ట్

Pisces : మీనరాశికి 2025 కలిసొస్తుందా? యోగ బలం.. శివారాధన, హనుమాన్ చాలీసాతో..?

Aquarius : కుంభం.. 2025 రాశి ఫలితాలు.. శ్రీమన్నారాయణ స్తోత్రపారాయణం చేస్తే?

మకర రాశి 2025 ఫలితాలు.. సుబ్రహ్మణ్యేశ్వరునికి అర్చన చేస్తే?

Sagittarius 2025: ధనుస్సు రాశికి 2025 ఎలా వుంటుంది? విష్ణుసహస్రనామ పారాయణ చేస్తే?

Karthika Deepam 2025: 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments