Webdunia - Bharat's app for daily news and videos

Install App

27-03-2022 ఆదివారం రాశిఫలాలు - ఆదిత్యుని ఎర్రని పూలతో పూజించిన శుభం..

Webdunia
ఆదివారం, 27 మార్చి 2022 (04:04 IST)
మేషం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణాల కోసం అన్వేషిస్తారు. నేడు చేజారిన అవకాశం రేపు కలిసివస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.
 
వృషభం :- స్త్రీలతో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. నిరుద్యోగులు నిరుత్సాహం, నిర్లిప్తత విడనాడిన సత్ఫలితాలు సాధిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. షాపుగుమాస్తాలు, పనివారలకు వస్త్ర ప్రాప్తి, ధనలాభం, విందు భోజనం. ధనాదాయ వృద్ధి, వ్యవహార జయం వంటి సత్ఫలితాలున్నాయి. 
 
మిథునం :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. హోటలు తినబండ వ్యాపారులకు కలిసివచ్చేకాలం. ఓర్పు, పట్టుదలతో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. స్టేషనరీ, ప్రింటింగు రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. విదేశీ వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి.
 
కర్కాటకం :- కుటుంబంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోవడంవల్ల ఆందోళనకు గురవుతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేటు సంస్థలోని వారికి ఓర్పు, అంకితభావంతో పనిచేసి మంచి గుర్తింపు, రాణింపు పొందుతారు.
 
సింహం :- విందులు, వినోదాల్లో మితంగా వ్యవహరించండి. ఆప్తులకు విలువైన కానుకలు చదివించుకుంటారు. శత్రువులు మిత్రులుగా మారతారు. దుబారా నివారించ లేకపోవడం వల్ల ఆందోళన తప్పదు. ఏదైనా స్థిరాస్తి అమ్మకానికై చేయు యత్నం వాయిదా వేయండి. దంపతుల మధ్య బంధువుల ప్రస్తావనవస్తుంది.
 
కన్య :- వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి పురోభివృద్ధి పొందుతారు. కొంతమంది మీ గురించి చాటుగా విమర్శలు చేసే ఆస్కారం ఉంది. స్త్రీలకు ఆరోగ్యపరంగాను, ఇతరత్రతా సమస్యలెదుర్కోవలసి వస్తుంది. మీ యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థినిలు ధ్యేయ సాధనకు మరింతగా శ్రమించాలి.
 
తుల :- గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. స్త్రీలు అకారణంగా నవ్వటం వల్ల కలిగే అనర్థాలను గ్రహిస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదని గమనించండి. మీ పొదుపరితనం కుటుంబీకులకు చికాకు కలిగిస్తుంది. వ్యాపారంలో మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
 
వృశ్చికం :- విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవటంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. వాహన చోదకులకు స్వల్ప ఆటంకాలు తప్పవు. దైవ, సేవా, పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరీ, సోదరుల మధ్య వివాదాలు తలెత్తుతాయి. బంధువుల రాకతో అనుకోని కొన్ని ఖర్చులు మీద పడతాయి.
 
ధనస్సు :- విదేశీ యత్నాలు వాయిదా పడతాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు తలెత్తుతాయి. ఆదాయ వ్యయాల్లో చక్కని ప్రణాళికలతో ముందుకు సాగుతారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. రావలసిన ధనం అందటంవల్ల మీ అవసరాలు తీరుతాయి.
 
మకరం :- దీర్ఘకాలిక సమస్యలకు మంచి పరిష్కార మార్గం గోచరిస్తుంది. దూర ప్రయాణాలలో కొత్త పరిచయాలేర్పడతాయి. విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత స్నేహితులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం. విందులలో పరిమితి పాటించండి.
 
కుంభం :- ఉద్యోగస్తులు విశ్రాంతి పొందుతారు. రాజకీయనాయకులు సభ సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. దంపతుల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. చేపట్టిన పనులు బంధువుల రాక వల్ల వాయిదా పడతాయి. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు అధికారుల వేధింపులు అధికమవుతాయి.
 
మీనం :- రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఇతరుల విషయాలలో తలదూర్చడం వల్ల ఇబ్బందులకు గురవుతారు. స్త్రీలు గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో కలసి సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: జగన్‌కు నిజంగా ధైర్యం ఉంటే, అమరావతి పురోగతిని చూడాలి.. దేవినేని

సెల్ఫీ కోసం కదిలే రైలు నుంచి ఫోన్ బైట పెట్టాడు, ఒకే ఒక్క దెబ్బతో సెల్ ఎగిరిపడింది (video)

Pulasa Comment: రెండేళ్లలో అమరావతి జలాల్లో ప్రజలు పులస చేపలు పట్టుకోవచ్చు

Airtel: ఎయిర్ టెల్ యూజర్లకు నెట్‌వర్క్ అంతరాయం..

Telangana Floods: సిద్దిపేట గౌరారంలో అత్యధిక వర్షపాతం- ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

కాలజ్ఞానం రాస్తున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని తొలిసారి చూచినదెవరో తెలుసా?

16-08-2025 శనివారం దినఫలాలు - సర్వత్రా కలిసివచ్చే సమయం...

17-08-2025 నుంచి 23-08-2025 వరకు మీ వార రాశిఫలితాల

Janmashtami: శ్రీ కృష్ణుడి రాసలీలల పరమార్థం ఏంటి?

జన్మాష్టమి 2025: పూజ ఎలా చేయాలి? పసుపు, నీలి రంగు దుస్తులతో?

తర్వాతి కథనం
Show comments