Webdunia - Bharat's app for daily news and videos

Install App

26-12-2021 ఆదివారం దినఫలాలు - రాజరాజేశ్వరి అష్టకం చదివితే...

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (04:00 IST)
మేషం :- రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. దూర ప్రయాణాల నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఇతరుల విషయాలలో అతిగా వ్యవహరించడం వల్ల అభాసుపాలయ్యే ఆస్కారముంది. స్త్రీల కోరికలు, మనోవాంఛలు నెరవేరుతాయి.
 
వృషభం :- మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. అయినవారి నుంచి అభిమానాన్ని, ప్రేమను మరింత పొందుతారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
 
మిథునం :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మాటలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. 
 
కర్కాటకం :- ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. రవాణా, ఎక్స్‌పోర్ట్ రంగాల్లో వారు పనివారి వల్ల ఇబ్బందులకు గురవుతారు. బంధు మిత్రులతో రహస్య సంభాషణలు కొనసాగిస్తారు. వ్యవహార సానుకూలతకు బాగా శ్రమిస్తారు.
 
సింహం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కని పెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. రాజకీయ నాయకులు ప్రముఖులతో చర్చలు జరుపుతారు. మీ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించడం మంచిది.
 
కన్య: - బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ప్రముఖుల నుండి ఆహ్వానాలు మీకెంతో సంతృప్తి నివ్వగలవు. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. దైవదర్శనాలలో పాల్గొంటారు. స్త్రీలు షాపింగ్ కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. 
 
తుల :- పాత మిత్రుల కలయికతో మీలో కొంత మార్పు వస్తుంది. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత అవసరం. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
వృశ్చికం: - మీ సంతానం మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు తప్పవు. నిరుద్యోగులకు శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
 
ధనస్సు :- ఉద్యోగస్తులు విలువైన కానుకలు అందించి అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. బంధువుల వల్ల సమస్యలు, చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. తినుబండారాలు, పండ్లు, బేకరి, వస్త్ర వ్యాపారులకు సంతృప్తి పురోభివృద్ధి, చేతివృత్తులు, చిన్న తరహా పరిశ్రమల వారికి సామాన్యం. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది.
 
మకరం :- ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని భంగపాటుకు గురవుతారు. మొండి ధైర్యంతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. రాజకీయ నాయలకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
కుంభం :- వ్యాపారాలు బాగుగా అభివృద్ధి చెందుతాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. ఆదాయం పెరిగి రుణాలు తీరుస్తారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. కుటుంబీకులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.
 
మీనం :- ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కివస్తాయి. స్త్రీలకు దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి మరింత పెరుగుతుంది. బంధువులరాకవల్ల ఖర్చులు, పనిభారం, ఒత్తిడి, చికాకులు అధికం. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకోవలసి వస్తుంది. సోదరీ, సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

లేటెస్ట్

దీపావళి 2024: ఆవు నెయ్యి, నువ్వుల నూనెలతో దీపాలు వెలిగిస్తే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమిటి?

ఈ 3 లక్షణాలున్న భార్యతో వేగడం చాలా కష్టం అని చెప్పిన చాణక్యుడు

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఎనిమిది దేశాలు, 13 నగరాల్లో కళ్యాణోత్సవం

దీపావళి రోజున దీపాలను నదుల్లో వదిలేస్తే..?

గురువారం అక్టోబర్ 31న తిరుమల విఐపి దర్శనం రద్దు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments