Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

23-12-2021 గురువారం రాశిఫలాలు : కుబేరుడిని ఆరాధించిన ఆర్థికాభివృద్ధి... (video)

Advertiesment
23-12-2021 గురువారం రాశిఫలాలు : కుబేరుడిని ఆరాధించిన ఆర్థికాభివృద్ధి... (video)
, గురువారం, 23 డిశెంబరు 2021 (04:00 IST)
మేషం :- టెక్నికల్, కంప్యూటర్ రంగాలలో వారికి లాభదాయకంగా ఉంటుంది. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వివాదాస్పదమవుతుంది. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. తొందరపడి మీ అభిప్రాయాలు బయటకు చెప్పటం వలన సమస్యలు ఎదుర్కొంటారు. భార్యా, భర్తల మధ్య సయోధ్య కుదరదు.
 
వృషభం :- స్త్రీలకు సంపాదపట్ల ఆసక్తి అధికమవుతుంది. బ్యాంక్ వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీరు ప్రేమించే వ్యక్తితో మరింత ఆనందాన్ని పొందుతారు. ప్రింటింగు, స్టేషనరీ రంగాలలో వారికి లాభదాయకం. స్థిరాస్తి విక్రయానికి ఆటంకాలు తొలగిపోగలవు.
 
మిథునం :- రాజకీయనాయకులు విందు, వినోదాలలో పాల్గొంటారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త వహించండి. ధనం ఏ మాత్రం ఆదా చేయలేకపోవడం వల్ల ఆందోళన చెందుతారు. విదేశాలకు వెళ్ళటానికి మీరు చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు.
 
కర్కాటకం :- కొంత మంది సూటిపోటీ మాటల వల్ల మీరు మానసిక ఆందోళనకు గురవుతారు. రోజులు భారంగా, మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు పనివారితో ఓర్పు, నేర్పు అవసరం. ప్రైవేటు సంస్థలలోని వారు ఎంత శ్రమించినా యాజమాన్యం గుర్తింపు ఉండదు. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది.
 
సింహం :- రవాణా, మెకానికల్, ఆటోమొబైల్ రంగాల వారికి పురోభివృద్ధి. ఇతరులకు వాహనం ఇవ్వటం వల్ల సమస్యలు తలత్తుతాయి. ఫైనాన్స్, వ్యాపారస్తులు మెళుకువ వహించండి. బాకీలు, ఇంటి అద్దెల వసూలలో సంయమనం పాటించండి. సంతానపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేకూరుస్తాయి.
 
కన్య :- ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు స్వయం కృషితో రాణిస్తారు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనలు చూసి మోసపోయే ఆస్కారం ఉంది. విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి. 
 
తుల :- మీ కుటుంబీకుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనలు చూసి మోసపోయే ఆస్కారం ఉంది. బ్యాంక్ వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తి అధికమవుతుంది. విద్యార్థులు పై చదువులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
 
వృశ్చికం :- ఆధ్యాత్మిక, దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బ్యాంక్ వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులు తోటివారి సహకారం వలన గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రుణం తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం.
 
ధనస్సు :- మిత్రులపై ఉంచిన నమ్మకం సన్నగిల్లుతుంది. మీ కళత్ర మొండి వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. స్త్రీలకు టీవీ ఛానెళ్లు, పత్రికా సంస్థల నుంచి పారితోషికం అందుతుంది. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరున్న వాస్తవం గ్రహించండి.
 
మకరం :- ఆర్థికస్థితి కొంతమేర మెరుగుపడుతుంది. స్థిరాస్తుల అమ్మకానికై చేయు యత్నాలు వాయిదా పడటం మంచిది. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలను ఎదుర్కుంటారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది.
 
కుంభం :- వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి. కళాకారులు, సినిమా రంగాల్లో వారికి అభిమాన బృందాలు పెరుగుతాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. లాయర్ నోటీసులకు ధీటుగా స్పందిస్తారు. ఏమరపాటు తనంతో ఉద్యోగస్తులకు ఇబ్బందులు తప్పవు. స్త్రీల అదుపు తప్పిన ఆవేశంవల్ల కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది.
 
మీనం :- సంఘంలో మీ మాటపై నమ్మకం గౌరవం పెరుగుతాయి. చేపట్టిన పనులు అసంపూర్ణంగా ముగించవలసి వస్తుంది. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు అధికారుల నుంచి వేధింపులు వంటివి ఎదుర్కొంటారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వామి మీకిది తగునా? టిటిడి పాలకమండలి సభ్యులు