Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వామి మీకిది తగునా? టిటిడి పాలకమండలి సభ్యులు

Advertiesment
స్వామి మీకిది తగునా? టిటిడి పాలకమండలి సభ్యులు
, బుధవారం, 22 డిశెంబరు 2021 (15:50 IST)
టీటీడీపై కొందరు స్వాములు మిడిమిడి జ్ఞానంతో వ్యాఖ్యలు చేస్తున్నారని టిటిడి పాలక మండలి సభ్యుడు పోకల‌ అశోక్ కుమార్ ఆరోపించారు. ఇవాళ తిరుపతి ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోకల అశోక్ కుమార్ ఉదయాస్తమాన సేవపై ఇటీవల కిష్కింద క్షేత్రం పీఠాధిపతులు గోవిందానంద సరస్వతి స్వామిజీ చేసిన వ్యాఖ్యలపై టిటిడి పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ స్పందించారు.

 
ఈ‌ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోవిందానంద సరస్వతి వ్యాఖ్యలు ఖండిస్తున్నామని, ఉదయాస్తమాన సేవ అంటే ఏంటో ఆయనకు తెలియదన్నారు. ఇవాళే మొదలెట్టినట్లు, డబ్బుల కోసం టీటీడీ చేస్తున్నట్లు దుష్ప్రచారం చేయడం సబబు కాదన్నారు. 1983లోనే టిటిడి ఉదయాస్తమాన సేవలు ప్రారంభించిందని వివరించారు.

 
2006లో డొనేషన్స్ ఆగిపోయాయని, వీటి లైఫ్ టైం 25 ఏళ్ళు మాత్రమే ఉంటుందని, ప్రస్తుతం 531 ఖాళీలు ఏర్పడ్డాయని, 2006లో పది లక్షలకు పెంచడం జరిగిందన్నారు. చిన్న పిల్లలకు వైద్యం కోసం ఉదయాస్తమాన సేవల ద్వారా వచ్చిన విరాళాన్ని కేటాయించాలని టిటిడి పాలక‌మండలి నిర్ణయించిందన్నారు. 

 
టీటీడీపై పూర్వాఫలాలు తెలుసుకోకుండా మాట్లాడటం మంచి పద్దతి కాదని విమర్శించారు. రాష్ట్రపతులు, వివిధ దేశాధినేతలు టీటీడీ పాలనకు కితాబు ఇస్తుంటే, మిడిమిడి జ్ఞానం కలిగిన స్వాముల ఆరోపణలు హాస్యాస్పదంగా ఉందన్నారు. టీటీడీలో ఎలాంటి అన్యాయం, అవినీతి జరగటం లేదని ఆయన స్పష్టం చేశారు.

 
తప్పుడు ప్రచారం చేసే స్వాములనే శ్రీ వేంకటేశ్వరుడు శిక్ష విధిస్తాడని తెలిపారు. టిక్కెట్లను పారదర్శకంగా ఆన్లైన్లో విడుదల చేయనున్నామని, జీయో క్లౌడ్ ద్వారా ఈ టిక్కెట్లను అందుబాటులోకి తీసుకొస్తామని, త్వరలోనే జియో క్లౌడ్ ద్వారా టీటీడీ ప్రత్యేక యాప్ ద్వారా భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు టిటిడి పాలక మండలి సభ్యులు పోకల అశోక్ తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

22-12-2021 బుధవారం రాశిఫలాలు : నవదుర్గాదేవిని ఎర్రని పూలతో పూజించిన...