Webdunia - Bharat's app for daily news and videos

Install App

22-12-2021 బుధవారం రాశిఫలాలు : నవదుర్గాదేవిని ఎర్రని పూలతో పూజించిన...

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (04:00 IST)
మేషం :- పోర్టు, ట్రాన్సుపోర్టు రంగాల వారికి పురోభివృద్ధి. ముఖ్య వ్యవహారాలను మరింత వేగవంతం చేస్తారు. కలప, ఐరన్, సిమెంటు, ఇటుక, ఇసుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. స్త్రీలకు విలాస వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. భాగస్వామిక వ్యాపారాలు,
జాయింట్ వెంచర్లకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. 
 
వృషభం :- రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో, అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తత అవసరం. నూతన బాధ్యతలను అంగీకరించే ముందు జాగ్రత్త ఆలోచించండి. ఉపాధ్యాయులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
మిధునం :- వృత్తుల వారికి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. రాబడికి తగినట్లు ఖర్చులుండటం వల్ల ఇబ్బందులుండవు. విద్యార్థులు తమ లక్ష్య సాధనకు బాగా కృషి చేయాల్సి ఉంటుంది.
 
కర్కాటకం :- చేతివృత్తుల వారికి సదవాశాలు లభిస్తాయి. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులను కలిగిస్తాయి. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో సన్నిహితంగా ఉండటం మందిదికాదు. దంపతులకు సంతాన యోగం. మీరు చేసే పనికి ఫలితం మరోరకంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
సింహం :- మార్కెట్ రంగాల వారు టార్గెట్లను పూర్తి చేస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం లభించదు. నూతన వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి. కార్యసాధనలో ఆటంకాలు అధికమిస్తారు.
 
కన్య :- స్థిరచరాస్తుల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. మీ కొత్త పథకాలు ఆచరణలో పెట్టి జయం పొందండి. ప్రభుత్వోద్యోగులకు విధి నిర్వహణలో ఇబ్బందులెదురవుతాయి. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టటం వల్ల కాంట్రాక్టర్లు సమస్యలకు లోనవుతారు. ప్రింటింగ్ రంగాల వారికి అక్షర దోషాల వల్ల చికాకులు తప్పవు.
 
తుల :- హోటల్, తిను బండారాలు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. ఏకాగ్రత లోపించటం వల్ల విద్యార్థినులు ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. వస్త్ర,బంగారం, వెండి వ్యాపారులకు పనివారలతో చికాకులు తలెత్తుతాయి. కష్ట సమయంబలో మిత్రులకు అండగా నిలుస్తారు.
 
వృశ్చికం :- కుటుంబ సౌఖ్యం, వాహనయోగం పొందుతారు. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. పెద్దల ఆహార, ఆరోగ్య విషయాల్లో మెలకువ వహించండి. వ్యాపారాలకు కావలసిన పెట్టుబడి సమకూర్చుకుంటారు. వాహనం, గృహోపకరాణాలు అమర్చుకుంటారు.
 
ధనస్సు :- కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు నిరుత్సాహపరుస్తాయి. పత్రికా రంగంలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు రావలసిన క్రైమ్‌లు మంజూరవుతాయి. వైద్య రంగాల వారికి చికాకులు, ఇంజనీరింగ్, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి ఒత్తిడి అధికమవుతాయి. ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి.
 
మకరం :- అర్థాంతరంగా నిలిపి వేసిన పునఃప్రారంభమవుతాయి. మీ సంతానం విద్య, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ కనబరుస్తారు. స్త్రీలకు బంధు వర్గాలతో సఖ్యత నెలకొంటుంది. గృహనిర్మాణాలలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది.
 
కుంభం :- స్త్రీలకు చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. విద్యార్థులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత కుదురుతుంది. ఉమ్మడి వ్యాపారాలు, నూతన వెంచర్లు సంతృప్తినిస్తాయి. మీ కార్యక్రమాలు మార్చుకోవలసి ఉంటుంది. లోపాయికారిగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు పెరిగినా తట్టుకుంటారు.
 
మీనం :- ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. రాజకీయ నాయకులు విదేశీ పర్యటనల కోసం చేసే యత్నాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. రుణయత్నాల్లో అనుకూలత, చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. బంధువుల గురించి అందిన ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lord Buddha: 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన బుద్ధుని పవిత్ర అవశేషాలు

అభ్యంతరకర వీడియోలు - 43 ఓటీటీలను నిషేధించిన కేంద్రం

ఆగస్టు ఒకటో తేదీ నుంచి నో హెల్మెట్ - నో పెట్రోల్

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

Chandrababu: ముగిసిన చంద్రబాబు సింగపూర్ పర్యటన- అమరావతికి తిరుగుముఖం

అన్నీ చూడండి

లేటెస్ట్

జూలై 30న స్కంధ షష్ఠి.. కుమార స్వామిని ఎర్రని పువ్వులు సమర్పిస్తే కష్టాలు మటాష్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

Garuda Panchami 2025: గరుడ పంచమి రోజున గరుత్మండుని పూజిస్తే.. సర్పదోషాలు మటాష్

తర్వాతి కథనం
Show comments