Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

17-12-2021 శుక్రవారం రాశిఫలాలు : గౌరిదేవిని ఆరాధించినా మనోసిద్ధి...

Advertiesment
17-12-2021 శుక్రవారం రాశిఫలాలు : గౌరిదేవిని ఆరాధించినా మనోసిద్ధి...
, శుక్రవారం, 17 డిశెంబరు 2021 (04:00 IST)
మేషం :- బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. ఒక ముఖ్య విషయమై న్యాయ సలహా పొందుతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
వృషభం :- హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రుల రాకపోకలు, కుటుంబీకులతో ఉల్లాసంగా గడుస్తుంది. సంఘంలో గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు లభిస్తాయి.
 
మిథునం :- విద్యా సంస్థల వారికి ఆందోళన తప్పదు. దూర ప్రయాణాలు సంతృప్తినిస్తాయి. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. రుణయత్నాలు ఫలిస్తాయి. బంధువుల రాకతో ఖర్చులు అధికం. ఎదుటివారిని అతిగా విశ్వసించటం అంత మంచిది కాదని గమనించండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి.
 
కర్కాటకం :- విద్యార్థులు విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. మీ తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. బంధువులతో సఖ్యత లోపిస్తుంది. రిప్రజెంటేటివ్‌లు, ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు సంతృప్తినిస్తాయి. కోర్టు వ్యవహారాలు, భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
సింహం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమాటాలు ఎదుర్కుంటారు. సొంతంగా వ్యాపారం, సంస్థలు స్థాపించాలనే మీ నిర్ణయం బలపడుతుంది. ఎదుటివారితో వీలైనంత మితంగా సంభాషించండి. విద్యార్థులకు విద్యావిషయాల పట్ల ఏకాగ్రత అవసరం.
 
కన్య :- కీలకమైన వ్యవహారాల్లో కుటుంబీకుల సలహా పాటించటం మంచిది. రాజకీయ నాయకులకు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. కొబ్బరి, పండ్లు, పూలు కూరగాయలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు.
 
తుల :- మీ కళత్ర ఆరోగ్యంలో అధికమైన జాగ్రత్త అవసరం. మీ వాక్చాతుర్యం, లౌక్యంతో అనుకున్నది సాధిస్తారు. మీ కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శించుకుంటారు. వస్త్ర వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ సామర్థ్యానికి ఆశించినంత ప్రతిఫలం లభిస్తుంది. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు.
 
వృశ్చికం :- పెద్దలను, గురువులను గౌరవించడం వల్ల మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్టేషనరీ, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసివచ్చే కాలం. విద్యార్థులు అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషించడం శ్రేయస్కరం కాదు. ఉద్యోగస్తులు విలువైన కానుకలు అందించి అధికారులను ప్రసన్నం చేసుకుంటారు.
 
ధనస్సు :- మీ సామర్థ్యానికి ఆశించినంత ప్రతిఫలం లభిస్తుంది. మీ వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఉన్నతాధికారులకు తనిఖీలు, పర్యవేక్షణలలో ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది.
 
మకరం :- ఆర్థిక ఇబ్బందులు లేకున్నా తెలియని అసంతృప్తి వెన్నాడుతుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. పెద్దలను, ప్రముఖులను కలుసుకొని వారికి బహుమతులు అందజేస్తారు. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. కొంతమంది మీ నుండి ధనం లేక ఇతరత్రా సహాయం అర్థిస్తారు.
 
కుంభం :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ యత్నాలకు బంధువుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు.
 
మీనం :- ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదుటివారిని సలహా అడగటం మంచిదని గమనించండి. మీ జీవితభాగస్వామి సలహా పాటించి లబ్ది పొందుతారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. హోటల్, కేటరింగ్ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధనుర్మాస ప్రారంభం... గురు ప్రదోషం.. ఏం చేయాలి?