ధనుర్మాస ప్రారంభం. ఈ రోజు గురు ప్రదోషం. భగవంతుడిని ప్రతీరోజూ స్తుతించడం ఉత్తమమే. అయినప్పటికీ పాపాలు హరించుకుపోవాలంటే.. పుణ్యఫలం చేకూరాలంటే శుభసమయం, శుభదినాలు, కొన్ని తిథుల్లో మహాశివుడిని పూజించడం చేయాలి. అలాంటి వాటిలో తృతీయ తిథి.. ప్రదోషం మహిమాన్వితమైంది.
గురువారం వచ్చే ఈ ప్రదోషం రోజున సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటల వరకు శివాలయంలో మహేశ్వరుడిని స్తుతించడం మంచి ఫలితాలను ఇస్తుంది. శివాలయానికి వెళ్ళి మౌనంగా కూర్చుని మహేశుడిని పూజించడం స్తుతించడం ద్వారా సకల పాపాలు హరించుకుపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
పుణ్యఫలం చేకూరుతుంది. భారీ ఎత్తున భక్తులుండే ఆలయాల్లో కాకుండా ప్రశాంతంగా వుండే శివాలయాలకు వెళ్లి...
"సిద్ధయోగీ మహర్షిశ్చ సిద్ధార్థః సిద్ధసాధకః ||
భిక్షుశ్చ భిక్షురూపశ్చ విపణో మృదురవ్యయః" అనే మంత్రంతో 108 సార్లు శివుడిని స్తుతించడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.