Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోహ్లి ప్రెస్‌మీట్ అప్‌డేట్స్: గంగూలీపై ఫ్యాన్స్ ఫైర్.. ఏమైందంటే?

కోహ్లి ప్రెస్‌మీట్ అప్‌డేట్స్: గంగూలీపై ఫ్యాన్స్ ఫైర్.. ఏమైందంటే?
, బుధవారం, 15 డిశెంబరు 2021 (17:44 IST)
Kohli
దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే ముందు టీమిండియా మాజీ టీ-20 కెప్టెన్ విరాట్ కోహ్లీ... టీమిండియా సారథ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  టీ20 కెప్టెన్సీ వదులుకున్నా వన్డే, టెస్ట్‌ల్లో కొనసాగుతానని చెప్పానన్నాడు. కానీ టీ20 కెప్టెన్సీ వదులుకుంటే వన్డే సారథ్యం నుంచి కూడా తప్పిస్తామని తనకు ఎవరు చెప్పలేదని కోహ్లీ అన్నాడు. రోహిత్ శర్మతో కూడా తనకు ఎలాంటి విభేదాల్లేవని, గత రెండేళ్లుగా చెప్పిందే చెప్పి తనకు విసుగొస్తుందన్నాడు.
 
టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ప్రత్యేకంగా కోహ్లీతో మాట్లాడారనే ప్రశ్నకు కోహ్లీ ఇలా సమాధానం ఇచ్చాడు. ట్వంటీ-20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని బీసీసీఐకి చెప్పినప్పుడు వద్దని ఎవ్వరూ వారించలేదు. జట్టు కోసమే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కోహ్లీ అన్నాడు. 
 
కానీ "వన్డే, టెస్ట్‌ల్లో కెప్టెన్‌గా కొనసాగుతానని కూడా చెప్పాను. నా నుంచి స్పష్టమైన సమాచారం అందించాను. బీసీసీఐ ఆఫీస్ బేరర్స్‌తో పాటు సెలెక్టర్లకు ఈ విషయం చెప్పాను. టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటే వన్డే కెప్టెన్సీ కూడా వదులుకోవాల్సి వస్తుందని అప్పుడు నాతో ఎవరూ అనలేదు. బహుషా.. ఐసీసీ ట్రోఫీలు గెలవలేదనే ఈ నిర్ణయం తీసుకోవచ్చు" అని విరాట్ పేర్కొన్నాడు.
 
విరాట్ క్లారిటీ ఇవ్వడంతో సౌరవ్ గంగూలీ దోషీగా తేలాడు. దాంతో నెటిజన్లు అతనిపై మండిపడుతున్నారు. బీసీసీఐ ప్రెసిడెంట్ హోదాలో ఉంటూ ఇలా అబద్దాలు ఆడటం స్థాయికి తగదని మండిపడుతున్నారు. కోహ్లీ కామెంట్స్ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ వివరణ ఇచ్చాడు. 
 
అంతేకాకుండా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవద్దని విరాట్ కోహ్లీని రిక్వెస్ట్ చేసినా అతను పట్టించుకోలేదన్నాడు. వ్యక్తిగతంగా తాను కూడా విరాట్ కోహ్లీ కన్విన్స్ చేసే ప్రయత్నం చేశానని చెప్పాడు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మతోడు... రోహిత్‌తో కోల్డ్‌వార్‌లేదంటున్న విరాట్ కోహ్లీ