Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15-12-2021 బుధవారం రాశిఫలాలు : గాయిత్రి మాతను ఆరాధించిన శుభం

Advertiesment
Daily Horoscope
, బుధవారం, 15 డిశెంబరు 2021 (04:00 IST)
మేషం :- దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. ఒక ముఖ్య విషయమై న్యాయ సలహా పొందుతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది.
 
వృషభం :- హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రుల రాకపోకలు, కుటుంబీకులతో ఉల్లాసంగా గడుస్తుంది. సంఘంలో గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు లభిస్తాయి.
 
మిథునం :- ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. విద్యా సంస్థల వారికి ఆందోళన తప్పదు. దూర ప్రయాణాలు సంతృప్తినిస్తాయి. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. రుణయత్నాలు ఫలిస్తాయి. బంధువుల రాకతో ఖర్చులు అధికం. ఎదుటివారిని అతిగా విశ్వసించటం అంత మంచిది కాదని గమనించండి.
 
కర్కాటకం :- బంధువులతో సఖ్యత లోపిస్తుంది. విద్యార్థులు విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు సంతృప్తినిస్తాయి. మీ తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. రిప్రజెంటటేటివ్‌లు, ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి.
 
సింహం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమాటాలు ఎదుర్కుంటారు. సొంతంగా వ్యాపారం, సంస్థలు స్థాపించాలనే మీ నిర్ణయం బలపడుతుంది. ఎదుటివారితో వీలైనంత మితంగా సంభాషించండి. విద్యార్థులకు విద్యావిషయాల పట్ల ఏకాగ్రత అవసరం.
 
కన్య :- ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. కీలకమైన వ్యవహారాల్లో కుటుంబీకుల సలహా పాటించటం మంచిది. రాజకీయ నాయకులకు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. కొబ్బరి, పండ్లు, పూలు కూరగాయలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. 
 
తుల:- మీ కళత్ర ఆరోగ్యంలో అధికమైన జాగ్రత్త అవసరం. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. వస్త్ర వ్యాపారులకు లాభదాయకం. మీ వాక్చాతుర్యం, లౌక్యంతో అనుకున్నది సాధిస్తారు. మీ సామర్థ్యానికి ఆశించినంత ప్రతిఫలం లభిస్తుంది. మీ కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శించుకుంటారు.
 
వృశ్చికం :- ఉద్యోగస్తులు విలువైన కానుకలు అందించి అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. పెద్దలను, గురువులను గౌరవించడం వల్ల మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్టేషనరీ, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసివచ్చే కాలం. విద్యార్థులు అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషించడం శ్రేయస్కరం కాదు.
 
ధనస్సు :- స్త్రీలు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సామర్థ్యానికి ఆశించినంత ప్రతిఫలం లభిస్తుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. మీ వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఉన్నతాధి కారులకు తనిఖీలు, పర్యవేక్షణలలో ఏకాగ్రత ముఖ్యం.
 
మకరం :- ఆర్థిక ఇబ్బందులు లేకున్నా తెలియని అసంతృప్తి వెన్నాడుతుంది. కొంతమంది మీ నుండి ధనం లేక ఇతరత్రా సహాయం అర్థిస్తారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. పెద్దలను, ప్రముఖులను కలుసుకొని వారికి బహుమతులు అందజేస్తారు. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి.
 
కుంభం :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. బంధువుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు.
 
మీనం :- ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదుటివారిని సలహా అడగటం మంచిదని గమనించండి. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది, మీ జీవితభాగస్వామి సలహా పాటించి లబ్ది పొందుతారు. హోటల్, కేటరింగ్ రంగాల వారికి లాభదాయకం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడే మోక్షదా ఏకాదశి: ఈ రోజున ఇలా పూజ చేస్తే..?