Webdunia - Bharat's app for daily news and videos

Install App

12-05-22 గురువారం రాశిఫలాలు .. సాయిబాబాను ఆరాధించిన మీ సంకల్పం...

Webdunia
గురువారం, 12 మే 2022 (04:02 IST)
మేషం :- దంపతుల మధ్య అభిప్రాయభేదాలు చోటుచేసుకుంటాయి. బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత అవసరం. విదేశీ వస్తువుల పట్ల ఆశక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన షేర్ల కొనుగోలులో పునరాలోచన అవసరం.
 
వృషభం :- మీ విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తత అవసరం. శత్రువులు మిత్రులుగా మారతారు. కలప, ఇటుక, ఐరన్ వ్యాపారులకు అనుకూలం. అదనపు సంపాదన కోసం చేసే యత్నాలుఫలిస్తాయి. సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు.
 
మిథునం :- చేతిలో ధనం నిలవటం కష్టమవుతుంది. సిమెంటు స్టాకిస్టులకు, వ్యాపారులకు పురోభివృద్ధి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు వాయిదా పడతాయి. వాహనం నడుపుతున్నపుడు మెళుకువు ఏకాగ్రత వహించండి. కొత్త షేర్ల కొనుగోళ్ళలో పునరాలోచన అవసరం.
 
కర్కాటకం :- ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఏకాగ్రత అవసరం. స్త్రీలకు అయిన వారితో పట్టింపులెదురవుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. కిరణా, ఫాన్సీ, నిత్యావసరాల వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఏ మాత్రం పొదుపుసాధ్యం కాదు.
 
సింహం :- ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి, ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి. ప్రయాణాల్లోనూ, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. స్త్రీలు ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. చేతివృత్తులు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు.
 
కన్య :- నూనె, మిర్చి, పసుపు, ఉల్లి, ఎండుమిర్చి, ధాన్యం వ్యాపారస్తులకు అభివృద్ధి. ఊహించని ఖర్చులు, దుబారా వ్యయం అధికంగా ఉంటాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. బంధుమిత్రుల కారణంగా మీ కార్యక్రమాల వాయిదా పడతాయి.
 
తుల :- కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. నేడు చేజారిన అవకాశం రేపు కలిసివస్తుంది. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట తప్పవు. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేస్తారు. రావలసిన బాకీలు వాయిదాపడతాయి. నిరుద్యోగులు ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు.
 
వృశ్చికం :- ఆపదసమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఎలక్ట్రానికల్, ఇన్వెస్టర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. మీ ఉన్నతినిచూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరగలదు.
 
ధనస్సు :- ఆదాయాని కన్నా ఖర్చులు అధికం. సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. పత్రికా సంస్థలోని వారికి చిన్న చిన్న పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. వ్యాపార లావాదేవీలు, ట్యాక్స్ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి, ప్రమోషన్ వంటి శుభఫలితాలున్నాయి.
 
మకరం :- ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానరాదు. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి శుభదాయకంగా ఉంటుంది. పోస్టల్, కొరియర్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. ప్రయాణాలలో ధనం అధికంగా వ్యయం చేస్తారు. ఒక వ్యవహారమై న్యాయసలహా స్వీకరిస్తారు. కీలకమైన వ్యవహారాల్లో సరియైన నిర్ణయాలు తీసుకుంటారు.
 
కుంభం :- దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. నిరుద్యోగులకు ఏ చిన్న అవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవటం మంచిది. ఇసుక, ఇటుక, ఐరన్, కలప, సిమెంటు వ్యాపారస్తులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మీ విరోధులు వేసే పథకాలు మీరు త్రిప్పికొడతారు. ఖర్చులు అధికమవుతాయి.
 
మీనం :- స్టేషనరీ, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసివచ్చేకాలం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. చేపట్టిన పనులలో స్త్రీలు ఒత్తిడి, శ్రమాధిక్యత ఎదుర్కుంటారు. ఏ వ్యక్తినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. ఉద్యోగస్తులకు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలించవు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్- ఏపీ పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయి.. ఐఫోన్ పార్ట్స్?

TDP: జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తాం.. చంద్రబాబు నాయుడు ప్రకటన

నర్మాలలో కలిసిన ఆ ఇద్దరు.. కరచాలనం చేసుకున్న కేటీఆర్-బండి సంజయ్ (video)

చంద్రబాబు బాటలో పవన్-ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి.. ర్యాంకులు కూడా ఇస్తారట

Brain cells: పనిపిచ్చి ఎక్కువ గల వారు మీరైతే.. ఇక జాగ్రత్త పడండి...

అన్నీ చూడండి

లేటెస్ట్

Ganesh Chaturthi 2025: వినాయక చతుర్థి రోజున మరిచిపోయి కూడా ఈ విషయాలు చేయకండి.

Ganesh Chaturthi 2025: గణేశ చతుర్థి రోజున విరిగిన విగ్రహాన్ని ఇంటికి తేవడం..?

25-08-2025 సోమవారం ఫలితాలు - ఒప్పందాల్లో జాగ్రత్త.. ఏకపక్ష నిర్ణయాలు తగవు...

Ganesh Chaturthi 2025: వక్రతుండ మహాకాయ

గణేశుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments