Webdunia - Bharat's app for daily news and videos

Install App

05-12-2021 ఆదివారం రాశిఫలాలుః మనశ్శాంతి కోసం కొన్ని విషయాల్లో..

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (05:00 IST)
మేషం: - ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. విద్యుత్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు.
 
వృషభం :- వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, దాని అనువైన పరిస్థితులు నెలకొంటాయి. అర్ధాంతరంగా నిలిచిన పనులు పునఃప్రారంభమవుతాయి. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు.
 
మిధునం : - ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో బాగుగా రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. పెద్దల ఆర్యోగములో మెళుకువ అవసరం.
 
కర్కాటకం : - మనశ్శాంతి కోసం కొన్ని విషయాల్లో సర్దుకుపోవటం క్షేమదాయకం. మీ కళత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఉద్యోగులకు విశ్రాంతి లభిస్తుంది. రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదా పడుట వల్ల ఆందోళనకు గురౌతారు. స్త్రీలకు తమ బంధువర్గాల నుంచి సంతోషకరమైన వార్తలు అందుతాయి. సింహం: - ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు.
 
సింహం : ధనం కంటె ఇచ్చిన మాటకు విలువనిస్తారు. విదేశీ చదువులు, నిరుద్యోగులు ఉద్యోగయత్నంలో సఫలీకృతులవుతారు. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.
 
కన్య : - వ్యాపారాల్లో ఒడిదుడుకులను సమర్థంగా ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల సమాచారం అందుతుంది. విద్యార్థులకు స్నేహ సంబంధాలు బలపడతాయి. రహస్యాలు దాచి పెట్టలేని బలహీనత ఇబ్బందులకు దారితీస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది.
 
తుల : - కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మిమ్ములను కాదన్నవారే మీకు చేరువయ్యేందుకు యత్నిస్తారు. ప్రయాణాలు ప్రశాంతంగా సాగుతాయి. చెక్కుల జారీ, చెల్లింపుల్లో మెలకువ వహించండి.
 
వృశ్చికం :- గతంలో ఇచ్చిన హామీ వల్ల వర్తమానంలో ఇబ్బందులు తప్పవు. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. ఒప్పందాలు, సంప్రదింపులు ఫలిస్తాయి.
 
ధనస్సు : - దంపతుల మధ్య అవగాహన లోపం, పట్టింపులు చోటు చేసుకుంటాయి. దైవకార్యాలు, వైద్య సేవలకు బాగా వ్యయం చేస్తారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. కొన్ని విషయాలు చూసీ చూడనట్టుగా పోవాలి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మకరం :- చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. ఆస్తి పంపకాల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం. దైవకార్యాలకు ధనం బాగా వెచ్చిస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. పనివారల నిర్లక్ష్యం ఆగ్రహం కలిగిస్తుంది. ఏ విషయంపైనా శ్రద్ధ వహించలేరు.
 
కుంభం :- వ్యాపారాల్లో ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. బకాయిలు, ఇంటి అద్దెల వసూళ్లలో సంయమనం పాటించండి. విద్యార్థులకు కోరుకున్న అవకాశం లభిస్తుంది. ఎటువంటి సమస్యనైనా నిబ్బరంగా ఎదుర్కుంటారు. స్త్రీలపై పొరుగువారి వ్యాఖ్యల ప్రభావం అధికం. మీ ఆరాటం, ఉత్సాహాలను అదుపులో ఉంచుకోవాలి.
 
మీనం :- దంతాలు, ఎముకలు, నేత్ర సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. స్తోమతకు మించిన ధన సహాయం, హామీలు ఇరకాటానికి గురిచేస్తాయి. మిమ్ములను కలవరపరిచిన సంఘటన తేలికగా సమసిపోతుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. చేపట్టిన పనుల్లో ఏకాగ్రత ముఖ్యం.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జామా మసీదు సమీపంలో అల్లర్లు - బలగాల మొహరింపు

ఆమె వయసు 36, ముగ్గురు పిల్లల తల్లి - ఇంటర్ విద్యార్థితో లేచిపోయింది...

Ambati Rayudu: పవన్‌కు ఇష్టం లేకున్నా.. ఏపీకి సీఎంను చేస్తా: అంబటి రాయుడు

పొరుగు రాష్ట్రాల మహిళలకు ఇప్పటికీ విద్యా హక్కు లేదు: మంత్రి దురైమురుగన్

ఉద్యోగం పేరుతో నయా మోసం... ఫేక్ కంపెలీ పేరుతో ఆఫర్ లెటర్... రూ.2.25 లక్షలు వసూలు

అన్నీ చూడండి

లేటెస్ట్

Yadagirigutta: టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు ట్రస్టు బోర్డు

07-03-2025 శుక్రవారం దినఫలితాలు- సంతోషకరమైన వింటారు. మీ కష్టం ఫలిస్తుంది..

తితిదే అన్నప్రసాదంలో అవి గారెలా? వడలా?: తితిదే ఛైర్మన్‌కి ప్రశ్నల వర్షం

ఈ రంజాన్ మాసంలో దుబాయ్‌లో ఐదు ముఖ్యమైన ఇఫ్తార్ ప్రదేశాలు

శని - రాహువు కలయిక.. అశుభ యోగం.. కన్య, ధనుస్సు రాశి వారు జాగ్రత్త!

తర్వాతి కథనం
Show comments