Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

02-12-2021 గురువారం రాశిఫలాలు : సాయిబాబా గుడిలో అన్నదానం చేసిన...

Advertiesment
02-12-2021 గురువారం రాశిఫలాలు : సాయిబాబా గుడిలో అన్నదానం చేసిన...
, గురువారం, 2 డిశెంబరు 2021 (04:00 IST)
మేషం :- ఉపాధ్యాయులకు కార్యక్రమాలలో ఒత్తిడి అధికమవుతుంది. వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి పనివారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ధనం చెల్లింపులు, పుచ్చుకునే విషయంలో మెళకువ అవసరం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి.
 
వృషభం :- ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. చిన్న పరిశ్రమల వారికి గడ్డుకాలం. మీ అతిచనువును ఇతరులు అపార్థం చేసుకునే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. అదనపు రాబడి మార్గాలు అన్వేషిస్తారు. 
 
మిథునం :- వృత్తుల వారికి పరిచయాలు, గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. ఒక స్థిరాస్తి విక్రయానికి అడంకులు తొలగిపోగలవు. ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
కర్కాటకం :-ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు ఆలస్యంగా గుర్తిస్తారు. ఒక మంచి చేశామన్న భావం సంతోషం కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడతాయి. శ్రీవారు, శ్రీమతికి అవసరమైన వస్తువులు సేకరిస్తారు. ప్రేమికులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
 
సింహం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. గృహనిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
కన్య :- బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త అవసరం. మీ జీవిత భాగస్వామి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ముఖ్యులతో సంభాషించేటపుడు అచి, తూచి వ్యవహరించడం మంచిది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. దాన, ధర్మాలు చేసి మంచి గుర్తింపు, రాణింపు పొందుతారు.
 
తుల :- ఆర్థిక ఒడిదుడుకుల వలన చికాకులను ఎదుర్కుంటారు. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. స్త్రీలకు నరాలు, పొట్ట, కాళ్లకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆత్మీయుని రాక చాలా సంతోషాన్ని కలిగిస్తుంది.
 
వృశ్చికం :- హోటల్ తినుబండరాలు, కేటరింగ్ రంగాల్లో వారికి కలిసివచ్చేకాలం. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలే ఇస్తాయి. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక ఫలిస్తుంది. విద్యార్ధులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
ధనస్సు :- శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. విదేశీ యత్నాల్లో స్వల్ప చికాకులు, ఆటంకాలు వంటివి ఎదుర్కుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, కూరల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పాత వస్తువులను కొనడంవల్ల సమస్యలు తలెత్తుతాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.
 
మకరం :- దైవ, సేవా, పుణ్యకార్యాలలో నిమగ్నమవుతారు. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అయిన వారి కోసం తాపత్రయపడతారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. తలపెట్టిన పనిలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా సంతృప్తిగా పూర్తి చేస్తారు. ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువ అవసరం.
 
కుంభం :- సిమెంటు, ఇసుక వ్యాపారులకు పురోభివృద్ధి ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ఖర్చులు అధికమవుతాయి. కొంతమంది మిమ్ములను తప్పుత్రోవ పట్టించి లబ్ది పొందటానికి యత్నిస్తారు. దంపతుల మధ్య అరమరికలు, దాపరికం కూడదు. బాధ లాంటి వాటిని వదలి సంతోషకరమైన జీవితాన్ని గడపండి.
 
మీనం :- వ్యాపార విషయముల యందు జాయింట్ సమస్యలు తప్పవు. ఉద్యోగ ప్రకటనలపై అవగాహన ముఖ్యం. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. పత్రికా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భూమాత చెంతకు వెళ్లిన సీతమ్మ.. రాముడి వద్దకు అలా వచ్చింది?