తులసి దేవిని పూజిస్తూనే ఉన్న వారి ఇల్లు సుసంపన్నంగా ఉంటుంది. అన్ని ఆశీర్వాదాలు వారికి దక్కుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల దేవతలు నివసిస్తారు. సూర్య చంద్రులు, అశ్వినీదేవుళ్లు మొదలైన వారు నివసిస్తారు.
నిత్యం తులసి మొక్కను పెంచి ఆరాధించడం ద్వారా సమస్త దేవతల అనుగ్రహం పొందవచ్చు. ముఖ్యంగా తులసీ దళాలతో కూర్చిన మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తారు. అలాగే హనుమాన్‌కు తులసీ మాల సమర్పించడం అందరికీ తెలిసిందే. దీని వెనుక వున్న పరమార్థం ఏంటంటే..
రామావతారం చివర శ్రీరాముడు సీతను ఇల అడిగాడు, "సీతాదేవి భూమాత చెంతకి వెళ్తే మీరు మళ్ళీ నన్ను ఎలా చేరుకుంటారు?" అని అప్పుడు సీతమ్మ.. ఇలా సమాధానం ఇస్తుంది.
"నేను తులసిగా తిరిగి వచ్చి మీ పాదాలను చేరుకుంటాను" అని సీతాదేవి చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి. అందుకే తులసి వున్న చోట రాముడు వుంటాడు. సీతారాములున్న చోట హనుమంతుడు వుంటాడు. అందుకే ఆంజనేయునికి, శ్రీరాముడికి ప్రసాదంగా తులసిని మాలగా సమర్పిస్తే, హనుమంతుడు ఎంతో సంతోషిస్తాడు. ఇంకా కోరిన కోరికలను నెరవేరుస్తాడని విశ్వాసం.