Webdunia - Bharat's app for daily news and videos

Install App

22-08-2025 శుక్రవారం ఫలితాలు - పుణ్యకార్యంలో పాల్గొంటారు...

రామన్
శుక్రవారం, 22 ఆగస్టు 2025 (04:31 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు అధికం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల కలయిక వీలపడదు. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారపరిజ్ఞానంతో రాణిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు సామాన్యం. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పరిచయస్తులను కలుసుకుంటారు. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
రుణసమస్య పరిష్కారమవుతుంది. ఖర్చులు అధికం. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. గృహమరమ్మతులు చేపడతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలతో తీరిక ఉండదు. విశ్రాంతిలోపం, అకాలభోజనం. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకూలతలున్నాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఆత్మీయుల సలహా పాటిస్తారు. ప్రణాళికలు వేసుకుంటారు. తలపెట్టిన పనులు పూర్తి చేయగల్గుతారు. నగదు, వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
భేషజాలకు పోవద్దు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. శ్రీమీతి సలహా పాటించండి. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలకు ధనం అందుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. రావలసిన ధనం అందుతుంది. వివాదాలు సద్దుమణుగుతాయి ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. సన్నిహితులతో సంభాషిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. స్థిరాస్తి ధనం అందుతుంది. ఒక సమస్య నుంచి బయటపడతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రతికూలతలెదురవుతాయి. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఖర్చులు విపరీతం. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. విలువైన వస్తువులు జాగ్రత్త. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యం సిద్ధిస్తుంది. యత్నాలను ఆప్తులు ప్రోత్సహిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ఒక పట్టాన సాగవు. పత్రాలు అందుకుంటారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. కొంతమొత్తం సాయం చేయండి. ప్రముఖుల సందర్శనం వీలు పడదు. చేపట్టిన పనులు అర్థాంతంగా ముగిస్తారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: సమంత విడాకులకు కేటీఆర్‌ కారణం.. కొండా సురేఖకు కవిత శుభాకాంక్షలు.. ఏంటిది?

Dinosaur-Era Discovery: రాజస్థాన్‌లో ఎముకలతో కూడిన అవశేషాలు.. డైనోసార్ యుగానికి చెందినవా?

జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై చంద్రబాబు సీరియస్?

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

లేటెస్ట్

19-08-2025 మంగళవారం ఫలితాలు - బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది...

18-08-2025 సోమవారం ఫలితాలు - శ్రావణ సోమవారం శివార్చన చేస్తే...

17-08-2025 ఆదివారం దినఫలాలు - పుణ్య కార్యాల్లో పాల్గొంటారు....

ఆదిత్యుడికి ఆరాధన చేస్తే ఫలితాలు ఏమిటో తెలుసా?

Dasara: శ్రీశైలంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు

తర్వాతి కథనం
Show comments