Webdunia - Bharat's app for daily news and videos

Install App

21-08-2023 సోమవారం రాశిఫలాలు - ఈశ్వరుడిని పూజించి అర్చించినా మీకు శుభం..

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2023 (04:00 IST)
మేషం :- కుటుంబంలో నెలకొన్న అనిశ్చితులు, అశాంతి క్రమంగా తొలిగిపోగలవు. క్రయ విక్రయరంగంలోని వారికి మెళకువ అవసరం. దూర ప్రయాణాలకై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత చాలా అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారులనుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
వృషభం :- ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి కలిసిరాగలదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. గత తప్పిదాలు పునరావృతమయ్యే ఆస్కారంఉంది. భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయటం మంచిది. గృహంలో కొత్త వాతావరణం, ఉత్సాహం సంతరించుకుంటాయి.
 
మిథునం :- ధన వ్యయంతో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో క్షణం తీరిక ఉండదు. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత ముఖ్యం. రియల్ ఎస్టేట్ రంగాలవారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన మంచిది. ఇతరుల సలహా కంటె సొంత నిర్ణయమే అన్నివిధాల శ్రేయస్కరం. 
 
కర్కాటకం :- ఆధ్యాత్మిక విషయాలు, పుస్తక పఠనంతో కాలక్షేపం చేస్తారు. ఏజెంట్లు, బ్రోకర్లు, కలెక్షన్ ఏజెంట్లకు శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. గృహ ప్రశాంతత మీ చేతుల్లోనే ఉందని గమనించండి. విద్యార్థుల ఆలోచనలు పక్కదారిపట్టే ఆస్కారం ఉంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావటం ఉత్తమం.
 
సింహం :- పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు, ఆక్షేపణలు ఎదుర్కోవలసివస్తుంది. బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో మెళకువ వహించండి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పన్నులు, రుణ వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. విద్యార్ధినులకు తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి.
 
కన్య :- శస్త్ర చికిత్స చేయునపుడు వైద్యులకు మెళుకువ అవసరం. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లలో పునరాలోచన అవసరం. ముఖ్యుల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. బంధువులరాక వల్ల కొంత అసౌకర్యానికి లోనవుతారు.
 
తుల :- అధికారుల సుదీర్ఘ సెలవుతో ఉద్యోగస్తులు నిశ్చింతకు లోనవుతారు. అనుభవజ్ఞులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాథి పథకాలపై ఆసక్తి మరింత పెరుగుతుంది. కుటుంబ ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి.
 
వృశ్చికం :- ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత అవసరం. ఆకస్మిక ఖర్చులెదురైనా కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. మీ కళత్ర మొండివైఖరి మీ చికాకు కలిగిస్తుంది. బృంద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యవసాయ రంగాల వారికి ఎరువులు, క్రిమి సంహారక మందుల కొనుగోళ్లలో చికాకులు, ఇబ్బందులు తప్పవు.
 
ధనస్సు :- కోర్టు వ్యవహరాలు వాయిదా పడటం మంచిదని గమనించండి. కందులు, ఎండుమిర్చి స్టాకిస్టులు, వ్యాపారస్తులు ఒక అడుగు ముందుకు వేస్తారు. స్త్రీలు గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత, మెళుకువ అవసరం. ఆధ్యాత్మిక విషయాలలో ఏకాగ్రత వహించలేరు.
 
మకరం :- నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. మిమ్మల్ని ప్రేమించేవారిని అశ్రద్ధ చేయటంమానండి. వృత్తి వ్యాపారాల్లో మొహమ్మాటాలు, ఒత్తిళ్లకు తావివ్వకండి. బ్యాంకు పనులలో ఏక్రగత, మెళుకువ ముఖ్యమని గమనించండి. కొన్ని అవకాశాలు ప్రయత్న పూర్వకంగాను, యాదృచ్చికంగానుకలిసివస్తాయి.
 
కుంభం :- ఉద్యోగస్తులకు హోదా పెరగటంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. అందరికి సహాయం చేసి మాటపడతారు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. లౌక్యంగా వ్యవహారించి మీ పనులు చక్కబెట్టుకుంటారు.
 
మీనం :- బంధువుల మధ్య ప్రేమాను బంధాలు బలపడతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోనివారికి కలిసివస్తుంది. మీ వాగ్ధాటితో ఎదటివారిని మెప్పిస్తారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు అధికారులు నుంచి ఒత్తిడి, చికాకులు పెరుగుతుంది. మీ సంతానం పై చదువుల కోసం పొదుపు పథకాలు చేపడతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పనిమనిషిపై అత్యాచారం-ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి మోసుకెళ్లిన కూతురు.. చివరికి? (video)

Kerala: నాలుగేళ్ల కుమారుడిని చిరుత దాడి నుంచి కాపాడిన తండ్రి

నాలుగేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా మరో మహిళతో భర్త, పట్టేసిన భార్య

Land Pooling: రూ.1941.19 కోట్లతో ల్యాండ్ పూలింగ్ పథకానికి ఆమోదం

అన్నీ చూడండి

లేటెస్ట్

Sravana Masam Fridays 2025: శ్రావణ శుక్రవారం-అష్టమి తిథి-లక్ష్మీదేవితో పాటు దుర్గకు పూజ చేస్తే?

01-08-2025 నుంచి 31-08-2025 వరకు మీ మాస ఫలితాలు

TTD: తిరుమల ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: టీటీడీ

Bangles: శ్రావణమాసంలో గోరింటాకు, గాజులు ధరిస్తే?

TTD: శ్రీవాణి దర్శనం టిక్కెట్లు.. దర్శనం సమయం సాయంత్రం 5 గంటలకు మార్పు

తర్వాతి కథనం
Show comments