19-08-2025 మంగళవారం ఫలితాలు - బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది...

రామన్
మంగళవారం, 19 ఆగస్టు 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఈ రోజు కొంతమేరకు అనుకూలం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య స్వల్ప కలహం. అనవసర జోక్యం తగదు. ఊహించని సంఘటనలెదురవుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అనుకున్నది సాధిస్తారు. మీ పట్టుదల ప్రశంసనీయమవుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చేపట్టిన పనులు సాగవు. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. చాకచక్యంగా వ్యవహరించాలి. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
లావాదేవీలలో ఏకాగ్రత వహించండి. ఏకపక్ష నిర్ణయం తగదు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. సన్నిహితుల సాయం అందుతుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. పిల్లల దూకుడు అదుపు చేయండి. నోటీసులు అందుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రతికూలతలు తొలగుతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు ఒక పట్టాన పూర్తి కావు. చీటికిమాటికి అసహనం చెందుతారు. అనవసర విషయాలకు ప్రాధాన్యమివ్వవద్దు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాలతో తీరిక ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. పెద్దల జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆశావహదృక్పథంతో మెలగండి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీ పై శకునాల ప్రభావం అధికం. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చు చేస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శ్రమించినా ఫలితం శూన్యం. ఆలోచనలు చికాకుపరుస్తాయి. నిస్తేజానికి లోనవుతారు. మనోధైర్యంతో వ్యవహరించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఖర్చులు విపరీతం. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
శుభవార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. ప్రశంసలందుకుంటారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. వేడుకకు హాజరవుతారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సర్వత్రా అనుకూలమే. వాగ్ధాటితో రాణిస్తారు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. సమయానికి ధనం సర్దుబాటవుతుంది. పాత పరిచయస్తులు తారసపడతారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. ఇంటి సమస్యలు చికాకుపరుస్తాయి. అతిగా ఆలోచింపవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. అనవసర జోక్యం తగదు. ఆప్తుల కలయికతో కుదుటపడతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. బాధ్యతలు అప్పగించవద్దు. చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త, ఇతరుల జోక్యానికి తావివ్వద్దు. వ్యవహారాలు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

అన్నీ చూడండి

లేటెస్ట్

సమాధిలోని దీపపు కాంతిలో దేదీప్యమానంగా వీరబ్రహ్మేంద్రస్వామి

23-11-2025 నుంచి 29-11-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

22-11-2025 శనివారం ఫలితాలు - మీపై శకునాల ప్రభావం అధికం...

21-11-2025 శుక్రవారం ఫలితాలు - చీటికి మాటికి అసహనం చెందుతారు...

Love: ప్రేమిస్తే ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిల్నే ప్రేమించాలి.. ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments