Webdunia - Bharat's app for daily news and videos

Install App

18-06-2025 బుధవారం దినఫలితాలు - అప్రియమైన వార్త వినవలసివస్తుంది

రామన్
బుధవారం, 18 జూన్ 2025 (05:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొందరి వ్యాఖ్యలు నీరుగారుస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. ఆచితూచి అడుగేయండి. అనాలోచిత నిర్ణయం నష్టం కలిగిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మనోధైర్యంతో మెలగండి. సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది. చేస్తున్న పనులు మధ్యలో నిలిపివేయవద్దు. దంపతుల మధ్య సఖ్యత లోపం. చిన్న విషయానికే చికాకుపడతారు. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలతో తీరిక ఉండదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. మనోధైర్యం కోల్పోవద్దు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. కొన్ని తప్పిదాలకు మూల్యం చెల్లించుకుంటారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. కొత్తయత్నాలు మొదలెడతారు. పనులు సానుకూలమవుతాయి. విలాసాలకు ఖర్చు చేస్తారు. పనులు పురమాయించవద్దు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. నిపుణులను సంప్రదిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యవహారంలో తొందరపాటు నిర్ణయం తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. ప్రయాణంలో ఒకింత అవస్థలెదుర్కుంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లావాదేవీలు ముగుస్తాయి. రుణవిముక్తులవుతారు. ఖర్చులు విపరీతం. ఆపత్సమయంలో సన్నిహితులు ఆదుకుంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అప్రియమైన వార్త వినవలసివస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. సంస్మరణ సమావేశంలో పాల్గొంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అవకాశాలు కలిసివస్తాయి. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. యత్నాలు కార్యరూపం దాల్చుతాయి. కొంత మొత్తం పొదుపు చేస్తారు. అందరితోను మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు తప్పుపడతారు. చేపట్టిన పనులు హడావుడిగా సాగుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. సమర్ధతను చాటుకుంటారు. ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పనులు చురుకుగా సాగాయి. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. వెండి, బంగారాలు జాగ్రత్త.
 
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కొత్తయత్నాలు మొదలెట్టండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
పొదుపు ధనం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ప్రముఖులను ఆకట్టుకుంటారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. దూరప్రయాణం చేయవలసివస్తుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. రావలసిన ధనం అందుతుంది. రుణ ఒత్తిళ్లు తొలగుతాయి. ఖర్చులు అధికం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. అనవసర విషయాల జోలికి పోవద్దు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. మీ కష్టం ఫలిస్తుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురైనా ఎటకేలకు పూర్తికాగలవు. విలాసాలకు ఖర్చు చేస్తారు. వాయిదాల చెల్లింపుల్లో అశ్రద్ధ తగదు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Kavitha: కవితకు బిగ్ షాకిచ్చిన కేటీఆర్‌.. పార్టీ నుంచి సస్పెండ్.. హరీష్ ఆరడుగుల బుల్లెట్

KCR: కేటీఆర్‌కు వేరు ఆప్షన్ లేదా? బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తారా?

బంగారం దొంగిలించి క్రికెట్ బెట్టింగులు : సూత్రధారులు బ్యాంకు క్యాషియర్.. మేనేజరే...

నాగార్జున సాగర్‌లో మా ప్రేమ చిగురించింది : సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

గణపతి ఉత్సవాల కోలాహలం: మంగళహారతి పాడుదాం రండి

Saturday Saturn Remedies: శనివారం నల్లనువ్వులు, ఆవనూనెతో ఇలా చేస్తే.. రావిచెట్టులో శనిగ్రహం..?

29-08-2025 శుక్రవారం ఫలితాలు - ఆప్తుల చొరవతో సమస్య పరిష్కారం....

Sankata Nasana Ganesha Stotram: సంకట నాశన గణేశ స్తోత్రాన్ని రోజూ పఠిస్తే..?

28-08-2025 గురువారం రాశిఫలాలు - ఎదుటివారి అంతర్యం గ్రహించండి.. భేషజాలకు పోవద్దు...

తర్వాతి కథనం
Show comments